Home » Close To Reality | andhra politics

కుక్క తోక వంకరే.. అని నిరూపిస్తూంది సాక్షి ఇంకా..

22. June 2009 by close to reality 1 Comments

సాక్షి పాట్లు..
కింద పడ్డా మాదే పై చేయి.. అంటూంది సాక్షి ఇంకా..
కుక్క తోక వంకరే.. అని నిరూపిస్తూంది సాక్షి ఇంకా..
అడ్డొస్తే ఎసేయ్యండి రా.. అన్న తన నైజం బయట పెట్టుకున్టూంది సాక్షి ఇంకా..

వివరాల్లోకి వెళ్తే.. కొవ్వూరు ఎం.ఎల్.ఎ విద్యార్ధిని పై అత్యాచారం, హత్య చేశాడంటూ నోటికి వచ్చిన రాతలు, ఆ రాత్రి వాళ్లకి కలలోకి వచ్చిన కూతలూ కూడా కలుపుకొని బాగా మసాలా దట్టించి వార్త రాసేసారు.. రాష్ట్రంలో ఇంకా ఎన్నో పెద్ద పెద్ద పత్రికలున్నయ్యి, ఆంగ్ల పత్రికలున్నయ్యి, అంతెందుకు పోలీసులు కూడా వున్నారు..
వీల్లెవల్లూ చూడలేనివి సాక్షి మాత్రమే చూసింది, వాల్లెవల్లూ చెప్పనివి కూడా సాక్షి మాత్రమే రాసింది.. పనికి రాని దద్దమ్మలని కొంత మందిని సాక్షి పాపం ఎ పార్టీ ఆబ్లిగేషన్ మీదో చేర్చుకున్నట్లుంది, అందుకే వాళ్ళు నిజాలు రాయరు, వాళ్ళకేం కావాలో అదే రాస్తారు.. ఎవడి మీదైనా కోపం వుంటే ఎం.ఎల్.ఎ నా ఎం.పి నా అని కూడా చూడరు, ఒక లక్ష ఇవ్వు లేక పోతే నీ గురించి చెడుగా రాస్తాను అంటారు..
అంత వరకూ ఎందుకు? వాళ్ళ దిన పత్రిక ఆఫీసులు మరియు వాళ్ళ సహోద్యోగుల్ని వాళ్ళే తగల బేడతారు.. తర్వాత ఆ నింద ఎవరో అమాయకుల మీద రుద్దుతారు.. ఒక వారం పాటు ఆ అబద్దాలతో పత్రికని నింపి, అది కాస్త చల్ల బడింది అనుకుంటే ఇంకో అబద్ధం కోసం వేట మొదలు..
వాళ్లకి ప్రజల సమస్యలు, వాటి పై పాలకుల చర్యలు ఇలాంటి ముఖ్యమైన విషయాలకన్నా "చంద్రబాబు వంగితే సాక్షికి న్యూసు, చంద్రబాబు దగ్గితే సాక్షికి న్యూసు, రోజులో నాలుగు పెజీలు చంద్రబాబు మీద టి.డి.పి మీద పడి ఏడవ టానికే కేటాయింపు, ఇంకో నాలుగు పెజీలు మిగిలితే కే.సి.ఆర్ మీద టి.ఆర్.ఎస్ మీద అక్కసు.. ఇంకో రెండు పెజీలు మిగిలితే చిరంజీవి దగ్గాడనే న్యూసు, పి.ఆర్.పి మటాష్ అనే న్యూసు.. ఇవి తప్ప సాక్షి వాళ్ళకి వార్తలే లేవు అనుకున్నారా? ఉన్నాయి.. హైదరాబాద్ బెగ్గింగు బిజినెస్ వీళ్ళకి దొరికిన బెస్టు న్యూసు.. Begging: Bindhas dhandha

ఇంతకన్నా సాక్షి గురించి ఇక్కడ ఇప్పుడు ప్రస్తావించడం అనవసరమేమో.. ఎందుకంటే పోలీసులు, నివేదికలు టి.డి.పి. ఎం.ఎల్.ఎ నర్సింగ్ కాలేజీ లో గోడల మీద ఉన్న మరకలు రక్తపు మరకలు కానే కావు అని చెప్పినా వాళ్ళు కల్లో కల్పించిన కట్టు కథ (కుక్క, మెడికల్ షాప్, ప్రైవేట్ క్లినిక్) పూర్తి అబద్ధం అని తేలినా ఈ సాక్షి ఇంకా ఏడుస్తూనే వుంది అనటానికి నేటి సాక్షి నాలుగో పేజీ నే సాక్షి.. (ఎందుకు నాలుగో పేజీ అంటారా? అబద్ధం అని జనాలకి అర్ధం అయ్యిపోయింది కదా అందుకే ఈ కథ నెమ్మదిగా నాలుగో పేజి కి చేరింది.. అందులోనూ మొదటి పేజిని మరో కొత్త అబద్ధానికి సిద్ధం చెయ్యాలి కదా.. అది బహుశా "పార్టీ అద్యక్ష పదవికి అడ్డంకి గా బావించి బావ చంద్రబాబు ని మర్డర్ చేసిన బాలయ్య " అని రాస్తుందేమో..)

మచ్చు కి కొన్ని సాక్షి తప్పుడు రాతలు..
పోలీసుల అదుపులో ఎం.ఎల్.ఎ : విద్యార్ధిని పై అత్యాచారం, హత్య  19.06.09 ఎం.ఎల్.ఎ కే రేప్, మర్డర్ కేసులు అంటగట్టిన వాళ్ళకి మీరూ నేనూ ఓ లెక్కా?

ఎం.ఎల్.ఎ కేసులో వీడని మిస్టరి..  20.06.09 కట్టు కథని కేసుగా మార్చింది ఎవరు? సాక్షి దాని వేలేఖరి కాదా?  ఆ నాటి సాక్షి పేపర్లో సగం స్టోరీలు రామా రావు గురించే.. అంటే ఆ రోజంతా అబద్ధాలు, వాటి మీద మళ్ళీ అబద్దపు విశ్లేషణలు, కట్టు కథలే కదా? కోట్లు ఖర్చు పెట్టి ముద్రించే పేపర్లో సగం అబద్ధాలే వుంటే దానికి పేపర్ అన్న పేరు ఎందుకు?

ఎ రోజు సాక్షి చూసినా ఏమున్నది ఉపయోగం, నిజం ?? అని ఎ రోజు సాక్షి తెరచినా వార్తలన్నీ మంది మీద పది ఎడిచేవే.. ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద పడి ఏడవటం మనం ఎక్కడైనా చూస్తుంటాం.. కానీ ఇదేంటో ఆంధ్ర ప్రదేశ్లో మాత్రం ప్రభుత్వ కర పత్రం తెల్లారి లేచినదగ్గరనుండీ రాత్రి పడుకున్నే దాకా, ఇంకా చెప్పా లంటే కాలాల్లో కూడా ప్రతిపక్షాల మీద ఏడుపే.. ఈ ఏడుపుగొట్టు ఎల్లో జర్నలిజం ( వాళ్ళ పేపర్ రంగుకి సరిపోయింది) ఎప్పుడు ఆగుతుందో మరి..

For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,

Comments (1) -

gf
United States gf said:

ee vishyam lo sakshi kontha overaction maata nijame. kaani AP lo Daarunam ga news ni vakrikarinche rendu patrikalu EEnadu and Andhrajyothi..

Comments are closed