
ఒక పార్టీకి చెందిన మూల సూత్రాలు హైజాక్ చేసినంత సులభం కాదు వాటిని ఆచరణలో చేసి చూపించడం.. 'మార్పు', 'సామాజిక న్యాయం' అన్న నినాదాల్ని మొదట తెచ్చిన పార్టీ 'లోక్ సత్తా'.. అయితే లోక్ సత్తా నాయకుడికి ప్రజా రాజ్యం అధ్యక్షుడయిన చిరంజీవి అంతటి ఫాలోయింగ్ లేక పోవటంతో 'లోక్ సత్తా' నినాదాల్ని చిరంజీవి చాలా సులభంగా హైజాక్ అయితే చేయగలిగాడు కాని, నేటి వరకు ఆ సామాజిక న్యాయం సొంత పార్టీలోనే ఎలా అమలు అవుతుంది అనేది జగద్విదితం.. ఆ పార్టీ లోకి వెళ్ళే వాడు వెళ్తున్నాడు, ఆ పార్టీనుండి బయటకి వచ్చే వాళ్ళు వస్తున్నారు.. 'సామజిక న్యాయం' సంగతి దేవుడెరుగు, మార్పు మాత్రం శూన్యం.. ఇంతకు ముందు కొన్ని నెలల క్రితం ఇక్కడే చెప్పినట్లు, కొత్త సీసా లో పాత సారానే ప్రజా రాజ్యం.. దానికి అంతకన్నా ఎక్కువ చెప్పుకోటం భావ్యం కాదు.. రాజకీయాల్లోకి వస్తే వూడపోడుస్తాం, ఇంకేదో చేస్తాం అన్న చిరంజీవి అండ్ కో మిగిలిన పార్టీల్లో నాయకులకి వలలు వెయ్యటం తప్పించి, అలాంటి పాత వాళ్ళని తమ పార్టీలోకి తీసుకొని రావడం తప్పించి ఫక్తు రాజకీయ పార్టీ లయిన కాంగ్రెస్, టిడిపి లకు భిన్నంగా చేస్తున్నది చెప్పుకోవడానికి ఏమి లేదు.. మేము కుళ్ళుని కడుగుతాం, చెత్తని ఏరి పారేస్తాం అని చెప్పరే తప్ప ఏనాడూ చెయ్యడానికీ ప్రయత్నించలేదు..
అయితే ఈ 'మార్పు' నినాద సృష్టికర్త జెపి అనుయాయులు మాత్రం మేము అందరికంటే భిన్నం అని బ్రహ్మాండంగా చేసి చూపిస్తున్నారు.. మీరు చెత్త అయినా, మీరు చేత్తవేసినా మేము ఆ 'చెత్త' ని ఏరి పారేస్తాం అని చేయి చేయి కలిపి మొన్నటి 'సామాజిక తెలంగాణా' అంటూ దిగ్విజయవంతం అయిన ప్రజా రాజ్యం పార్టీ సభా స్థలి వద్ద వదిలి వెళ్ళిన 'చెత్త'ని లోక్ సత్తా యువజన విభాగం అయినటువంటి 'యువ సత్తా' నాయకులు, కార్యకర్తలు ఆ 'చెత్త' ని ఏరి వేస్తున్న దృశ్యం ఇది.. యువ రాజ్యం అధినాయకుడికి ఇది కన్పిస్తుందని భావిద్దాం.. ఎ ఒక్క ప్రజా రాజ్యమ నాయకుడన్నా ఇది చూసాక ప్రజలకి ఎమన్నా చెబుతారేమో చూద్దాం.. ఉద్దేశ్యం ఏది ఆయినా కానివ్వండి, ఇక్కడ 'యువ సత్తా' చేసిన పని అభినందనీయం.. ఒక్క రాజకీయ పార్టీలే కాదు.. విందు, వివాహం, సభ, ఇలాంటి నలుగురు ఒక చోట కూడే కార్యక్రమం ఎవరు నిర్వహించినా ముగింపు డైలాగులు కొట్టి వచ్చిన అతిదుల కంటే ముందుగా కారెక్కి రయ్యిమని దూసుకుపోకుండా, అంతా వెళ్ళే వరకు వేచి వుండి, ఆ పిమ్మట ఎక్కడయితే కార్యక్రమం నిర్వహించారో మళ్ళీ ఆ సభా స్థలి ని అద్దంలా మార్చి ఇంటికి వెళ్ళడం వాళ్ళ బాధ్యత.. ఇలా వదిలి వెళ్ళే చెత్త వల్ల వ్యాపించే ఎలాంటి అంటు రోగాల బారినయినా ముందు బాధ పడేది తాము సభల్లో ఒకటే చెబుతున్న 'సామాజికం గా, ఆర్థికం గా వెనుకబడిన వాళ్ళే నన్న విషయాన్ని ఈ గొప్ప నాయకులు గుర్తెరగటం ఆ నాయకుల భవిష్యత్తుకే మంచిది..hats off to 'yuva satta'
For movie news and free telugu songs download, visit
anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,