Home » andhra politics | andhra pradesh | Indian Politics | Telangana

రెంటికి చెడ్డ రెడ్డి

22. January 2010 by viswamitra 0 Comments

CM ని నానా మాటలు అని, తెలంగాణ వాదులతో నేను మీతోనే ఉన్నానంటూ హీరో అయిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి, అధిష్టానం దృష్టిలో మాత్రం చెడ్డవాడయ్యాడు. రాజగోపాల్ ని అనుకరించి రాజీనామా ఇచ్చి, తర్వాత వెనక్కు తీసుకుని తెలంగాణ వాదుల దృష్టిలో ఇప్పుడు పలుచనయ్యాడు. రాజీనామాలే పరిష్కారమని ఒకసారి అంటారు. కేంద్రం నిర్ణయం తీసుకోడానికి సుముఖం అన్న సమయంలో రాజీనామాలు చేస్తే ఇప్పుడు తెలంగాణ వాదులకి రాజకీయంగా బలం ఉండదనీ ఆయనే చెప్తారు. విద్యార్థులు కోపంగా ఉన్నప్పుడు నాగం అక్కడికి వెళ్తే కొట్టరా అని యూనివర్సిటీలో నాగంపై దాడి చేసినప్పుడు కామెంట్ చేశారు. తర్వాత దాడిని ఖండించారు. ఇప్పుడు నాగం కూటమి తెలంగాణ కాంగ్రెస్ వారిని JAC కి దూరం చేయడానికి విశ్వప్రయత్నం చేస్తుంది. ఇక్కడి వారంతా పార్టీలకి అతీతంగా రాజీనామాలు చేయాల్సిందేనని పట్టు పడుతుంది.

For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,
Comments are closed