Home »

రైతుని ఆదుకోడానికి రాకెట్ సైన్స్ కావాలా?

28. January 2009 by viswamitra 0 Comments

అవసరానికి మించి సరఫరా ఉంటే వస్తువు విలువ తగ్గిపోతుంది. అది సహజం. నిలువ ఉండే కాలం కూడా తక్కువ గా ఉండడం వల్ల అసలు విలువే లేకుండా పోతే? పాలు, టమాట వంటి వాటికి అది వర్తిస్తుంది.

రాయల సీమలో ఒక టమాట బోర్డుని (డైరీ వలె) ఏర్పాటు చేసి దానిని ప్రధాన నగరాలతో అనుసంధానిస్తే, కనీసం మార్కెట్ పోకడలైనా తెలుసుకొని దానికి అనుగుణంగా ఆ ప్రభుత్వ బోర్డు స్పందించే అవకాశం వుంటుంది. ప్రస్తుత సరఫరా ఈవిధం గా వుంది.

రైతు - కమీషన్ ఏజెంటు - హోల్ సేలర్ (ప్రధమ / ద్వితీయ) - చిల్లర వ్యాపారి - వినియోగదారుడు


బోర్డు ద్వారా రైతుని సత్వరం చిల్లర వ్యాపారికి లేదా పెద్ద వినియోగదారునికి అనుసంధానిచే వీలు దొరుకుతుంది. సరఫరా అధికంగా వున్నా పోటీ ధర లభిస్తుంది లేదా కనీస మద్దతు ధర లభించడానికి అది ఉపయోగపడుతుంది. జ్యూసులు, సాస్ తదితర నిల్వ మార్గాలని అన్వేషించి పెట్టినా అవి అమలు చేయడానికి సమయం పడుతుంది.

 

సాంకేతికతని, వ్యాపార సూత్రాలని అవసరాన్ని బట్టి అమలు చేయనంతవరకు శ్రమ, డబ్బు వృధా అవుతూనే ఉంటాయి.

 

 

For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,
Comments are closed