Home » 2009 elections | andhra politics

మంద కృష్ణ కోరికలు

10. March 2009 by close to reality 0 Comments

ఇంత కాలం 'గొంతెమ్మ కోరికలు' అని విన్నాం, ఇక నుండి 'మంద కృష్ణ కోరికలు' అనే పదం 'గొంతెమ్మ కోరికలు' కి పర్యాయ పదం గా ఉపయోగిస్తారేమో? తన ఉద్యమానికి రాజకీయ రూపు కావాలంటూ కేవలం నాలుగు అంటే నాలుగు లోక్ సభ మరియు ముప్పై అసెంబ్లీ స్థానాలు ఇస్తే సరిపెట్టుకుంటాను అని చెబుతున్నాడు.. :) కొన్ని దశాబ్దాలు గా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ, రాష్ట్రమంతటా ఒక కులానికి మాత్రమె చెందకుండా ప్రతి ఒక్క పెదవాడికోసం భూపోరాటం, ఈ పోరాటం, ఆ పోరాటం అంటూ ప్రజల్లో మమేకమైన జాతీయ స్థాయి పార్టీలు అయిన కమ్యూనిస్టులు కూడా రెండు లోక్ సభ , ఇరవై అసెంబ్లీ సీట్లతో సరిపెట్టుకుంటున్న ప్రస్తుత ఎలెక్షన్ లలో మంద కృష్ణ కోరికని 'గొంతెమ్మ కోరికలు' అనకుండా ఇంకేమైనా అని పిలవచ్చేమో తెలీదు మరి..
ఇంతటితో ఆగితే ఎలావుండేదో కాని, న్యూస్ పేపర్ ఆఫీసులు , పార్టీ ఆఫీసు లు తగలబెట్టి పోలీసు కేసుల్లో ఇరుక్కున్న త్యాగధనుల్ని వెతికి పట్టుకోటం కష్టమేం కాదు ఎందుకంటే పోలీసు స్టేషన్ లలో వాళ్ళ పేరు మీద రికార్డు వుంటుంది, కాబట్టి ఇలాంటి చట్టాలకు, న్యాయానికి అనుగుణం గా నడుచుకొనే క్రమశిక్షణ గల వారిని వెతికి సీట్లు ఇస్తారంట.. ఇక్కడితో ఆగక బయటి కులాల వాళ్ళని కూడా వెదికి సీట్లు ఇస్తారంట.. గెలిచాక పెట్రోల్ పోసి తగలబెడతారేమో మరి ఈ ఉద్దండులు.. ఆనక మరణించిన వారికోసం ఐదు లక్షలు 'మంద కృష్ణ' పరిహారం గా ప్రకటిస్తారేమో.. ఎవడి అబ్బ సొమ్మొ ఎవరికీ తెలుసు?

For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,
Comments are closed