తెలుగుదేశం పార్టీ లో ఈయన కన్నా బుర్ర వున్న నాయకులే లేరు అనుకుంటున్నాడో లేక పిచ్చి కుక్క కాట్లకి డాక్టరు తో సూది మందు వేయించుకుంటూ ఉన్నాడో కానీ, ప్రసన్న తనంత మొనగాడే లేదన్నట్లు పిచ్చి వాగుడు పిచ్ ఇంకాస్త పెంచాడు..
ఇప్పుడు ఈయన గారి డిమాండ్ ఎంటయ్యా అంటే, బాలయ్యని టి.డి.పి అధ్యక్షుణ్ణి చేసి చంద్రబాబు పక్కకి తప్పు కోవాలంట.. బాబాయి, అబ్బాయి ల కి అంత సీనే వుంటే తెలుగు దేశం ఇప్పుడు ప్రతిపక్షంలో ఎందుకు కూర్చుందో మరి ఈయన గారే ప్రజలకి సమాధానం చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు బాబాయి కి అధ్యక్ష పదవి అడుగుతుంది ఈయనే కాబట్టి..
బాబాయి, అబ్బాయిలు పార్టీ కోసం ఎన్నికలప్పుడు ఎంతో శ్రమించారు, సహాయం చేసారు.. అంత మాత్రం చేత 25 సంవత్సరాలు చంద్రబాబు పార్టీ కి చేసింది కానీ, చంద్రబాబు పరిపాలనా సమర్ధత కానీ వాళ్లకింకా రాలేదన్నది మనందరికీ తెలుసు.. అంత దాకా ఎందుకు? ఈ సంగతి వాళ్ళకే తెలుసు, చంద్రబాబు ఆ పార్టీకి వెచ్చించే సమయంలో నాలుగో వంతు కూడా బాబాయి, అబ్బాయి లు కానీ, ఇప్పుడు మాట్లాడుతున్న ప్రసన్న కానీ కేటాయించలేరు..
అదీ సంగతి, ప్రసన్నని బయటకి గెంటక పోతే పాపం అతన్ని ఇంకా ఎన్నో పిచ్చి కుక్కలు కరుస్తాయి, అసలే పాపం ఆయనది ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉన్న సామాజిక వర్గం.. అటు టి.ఆర్.ఎస్ లో కూడా ఇప్పుడు వాళ్ళే బాంబులు పేలుస్తున్నారు.. ఇప్పుడు టి.డి.పి లో కూడా అదే చేయమని కాంగ్రెస్ లోని వాళ్ళ సామాజిక వర్గ బాస్ లు ఎంత ముట్ట జెప్పారో మరి.. "విభజించి పాలించు" అన్న ఆంగ్లేయుల సూత్రాన్ని ఆంధ్రా కాంగ్రెస్ అక్షరాలా ఆరంభించి అయిదు సంవత్సరాలు అయ్యింది, వాళ్ళు అందులో అధ్బుతంగా రాణిస్తున్నారు కూడా..
For movie news and free telugu songs download, visit
anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,
Share or Bookmark this post…