Home » 2009 elections | 2009 Parliament Elections | India | andhra politics

తెదేపా తెలంగాణా నాయకులకే ఈ ఓటమి అంకితం!

17. May 2009 by viswamitra 0 Comments

దేవేందర్ గౌడ్ బాబు పై తెచ్చిన ఒత్తిడి, తదనంతర పరిణామాలు పార్టీ పుట్టి ముంచాయి. మేము మా ప్రజలకు, కేసీఆర్ కు దీటయిన సమాధానం ప్రత్యేక తెలంగాణా పై ఇవ్వాలని, దాని పై తెదేపా వైఖరి స్పష్టం చేయకుండా ఎన్నికలకు వెళ్ళలేమని కోరి కేసీఆర్ తో తల గోక్కున్నారు. ఈ వాదన లేవనెత్తిన గౌడ్, పెద్దిరెడ్డి, కడియం, ఎర్రబెల్లి తదితరులు చంద్రబాబుని స్థిమితంగా ఉండనివ్వలేదు. తెలంగాణ తమ్ముళ్ళ అసమ్మతి తలనొప్పి భరించడం ఎందుకని కూటమిని ఆవిష్కరించారు బాబు గారు. అక్కడ ఆంధ్రా సెంటిమెంట్ బాగా పని చేసి, మిత్రుణ్ణి (తెరాసని) చూసి తెదేపాకి వాత పెట్టారు కోస్తా వోటర్లు.

కొసమెరుపేమిటంటే ఎర్రబెల్లి మినహా వైఖరి స్పష్టం చేయాలని మంకు పట్టు పట్టిన నేతలు అపజయం పాలయ్యారు. బాబు తనుచేయలనుకున్నది తాను చేసినంతకాలం అంతా సవ్యంగా నడిచింది. ఇకనైనా ఇంటిపెద్దని తనే అని గుర్తించి మసలు కోవడం మేలు, లేక పొతే పార్టీ అధ్యక్ష పదివికి తమ్ముళ్లే ఎసరు పెట్టగలరు!

Your Ad Here

For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,
Comments are closed