Home » Close To Reality | andhra politics

ఆఖరుకి విద్యతోనూ వ్యభిచారమా?

21. June 2009 by close to reality 0 Comments

ఈ ప్రభుత్వం నేటి దాకా కళ్ళకి కనపడేది, కనపడనిది అన్న తేడా లేకుండా "కాదేది కబ్జా కి అనర్హం" అని చెప్పి మన ఆస్తులన్నీ అడ్డమైన వెధవలకి తూ తూ మంత్రం రేట్లకి అమ్మి పారేసింది.. ఇంకో అయిదేళ్ళు గడిచేసరికి ఆంధ్రాలో ఆంధ్రా వాళ్లకి ఏమన్నా భూములు మిగులుతాయా లేక అన్ని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు పెద్ద మనుషుల జాగీర్లు గా మారుతాయా అని చింతిస్తున్న సమయంలో ఈ వార్త పిడుగు పాటే.. !!
ఎంసెట్ ర్యాంక్ లను ఇకపై ఇంటర్ మార్కులు కూడా కలిపి నిర్ణయిస్తాం అని చెప్పటం.. ఇప్పుటికే రాష్ట్రం లోని ఒక్కొక్క జిల్లాలో 30 ప్రభుత్వ కళాశాలలు ఉంటె, 130 నుండి  150 వరకు ప్రైవేట్ కళాశాలలు జెండా ఎగరేస్తున్నాయ్.. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ నియమం వల్ల ఉన్న ౩౦ ప్రభుత్వ కళాశాలలు కూడా మూత పడతయ్యి.. మరి రాష్ట్రంలో పేద విద్యార్ధులే లేరా? వాళ్ళంతా ఎక్కడ చదువుకోవాలి? వాళ్లకి ఫీజులు వీళ్ళ బాబు గాడు కడతాడా ప్రైవేటు కాలేజిల్లో ??
ఎందుకు ప్రభుత్వ కళాశాలలు మూత పడొచ్చు అంటారా? ఎందుకు అంటే? ఉదాహరణకి నువ్వు నేను ఇద్దరం ఎంసెట్ రాసాం.. నీకూ, నాకూ 3000 ర్యాంక్  వచ్చింది ఎంసెట్లో, కాకపోతే నాది ఇంటర్ నారాయణ కాలేజీ, నీది ఇంటర్ మీ వూళ్ళో ప్రభుత్వ కళాశాల.. నాకు నారాయణలో లక్ష దాకా తుప్పు వదిలింది.. కాకపోతే నాకు ఇంటర్ లో నా ముందు వెనుక నారాయణ వాడు clever లని కూర్చోబెట్టి పరీక్ష రాయించి నందుకు నాకు 870 మార్కులు వచ్చాయి.. నీకు ప్రభుత్వ కళాశాలలో అంతంత మాత్రపు శిక్షణ కి ఒక 670 మార్కులు వచ్చాయి అనుకుందాం.. ఇంకేముంది, వీళ్ళ దరిద్రపు రూలింగ్ వల్ల నా ఎంసెట్ ఫైనల్ ర్యాంక్  ౩౦౦౦ దగ్గరే వుంది, కానీ నీ ఎంసెట్ ఫైనల్ ర్యాంక్  4000 కి పడిపోయింది.. నాకు మంచి బ్రాంచ్లో సీట్ రావచ్చు, నీకు కచ్చితం గా మంచి బ్రాంచ్ లో అదీ ఫ్రీ సీట్ మాత్రం రాక పోవచ్చు.. ఇంకా దీని మీద నాకు అంబేద్కర్ 60 సంవత్సరాల క్రితం బహుకరించిన రిజర్వేషన్ సౌకర్యం, నీ మొహానికి అదీ లేదు.. మీ నాన్న డబ్బుల్లేక నిన్ను ప్రైవేట్ కాలేజిలో చదివించలేక పోతే, మా నాన్నకి అంబేద్కర్ పుణ్యమా అని వచ్చిన ఉద్యోగంతో పాటూ, నాకు ఇకపై ఇంజనీరింగ్లో కూడా ఈ పనికి రాని ప్రభుత్వాలు ఎలాగూ ఫీజులు కడతాయి.. ఏతా వాతా నీలా ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ చదివిన వాడు (భవిష్యత్తులో నన్నా అక్కడి అధ్యాపకులు మారతారు అన్న ఆశ ఎలాగూ లేదు) రెంటికీ చెడ్డ రేవడి అవుతాడు.. లేదు నీకు కూడ నాలా 870 మార్కులు రావాలంటే మీ నాన్న తల తాకట్టు అన్నా పెట్టాలి, లేక పోతే ఉన్న ఒకట్రెండు ఎకరాలన్న అమ్మేయ్యాలి.. అమ్మేస్తాడు సరే, నీకు ఇంజనీరింగ్ ర్యాంకు కూడా వచ్చింది  సరే, మరి ఇంజనీరింగ్ ఫీజులు ఎలా కడతాడు? గతంలో అంటే  నీ ఇంటర్ కే ఆస్తులు అమ్మకుండా.. నీకు ఎంట్రెన్సు లో మంచి రాంక్ వస్తే అప్పుడు ఇంజనీరింగ్ కి ఆస్తులు అమ్మి నిన్ను చదివిస్తే తరువాత నువ్వు అంబేద్కర్ రిజర్వేషన్ లని దాటుకొని ఉద్యోగం సంపాదించి మీ అమ్మా నాన్నల కష్టాలు కడతెర్చ వచ్చు.. కానీ ఇప్పుడు మాత్రం ఈ పనికి మాలిన ప్రభుత్వం పుణ్యమా అని నీ కుటుంభం రెండేళ్ళు ముందుగానే రోడ్డున పడుతుంది..

కాబట్టి, ఈ మొత్తం విషయాన్ని పరిశీలించాక అర్ధం అయ్యిందేంటంటే, ప్రైవేట్ కాలేజీ లకి అక్రమ మార్గం లో పక్కలు పరుస్తున్న ఈ నపుంసక ప్రభుత్వం ( ఇన్వాల్వు అయిన మనుషులు) హ్యాప్పీ, పక్కలు పరిపించుకొని వ్యభిచారం చేస్తున్న ఆ భోగంది (రాష్ట్రంలో లాబీఇంగ్ చేస్తున్న పెద్ద పెద్ద ప్రైవేటు కాలేజీ లు) హ్యాప్పీ.. ఎటు తిరిగీ లక్షలు కర్చు పెట్టి రెండేళ్ళు ఆ భోగం దాన్ని మేపిన నీ కుటుంభం, నువ్వూ మాత్రం ఖాళీ..

మధ్యలో నా గొడవ ఎందుకు లే, నాకు 60 ఏళ్ల క్రితమే మా ప్రియతమ నాయకుడు ముందు చూపు తో దేశాన్ని నాకు నా వర్గాలకి అప్పనం గా రాసి ఇచ్చేసాడు.. నీ ఏడుపు మాత్రం నువ్వు ఏడువు, నా రిజర్వేషన్ ల మీద పది ఏడవ మాకు.. ఏడ్చావా, నీ మీద నీ కుటుంభం మీద SC/ST  ఆట్రాసిటి కేసు పెట్టి బొక్కలో తోయిస్తా.. ఇది నాకున్న స్పెషలు హక్కు.. 

ఇక్కడ రచయిత రేజర్వేషన్లని పక్కన బెట్టి కాస్త విశాల భావంతో రాస్తే, ఆడ, మగ, కుల, మత, జాతి అన్న తేడా లేకుండా రాష్ట్రం లోని ప్రతి పేద విద్యార్ధి గుండెల మీద తన్నే నియమం ఈ క్రొత్త వైటేజి విధానం.. please write your opinions here without any hesitation..

ఇంకో నాలుగేళ్ళలో ఇంటర్ బోర్డు కూడా హుష్ కాకి అంట.. ఇంకేముంది, విద్యార్ధి కి విద్యార్ధి జీవితం లో వుండే దశలు కూడా మాయం.. ఇంటర్ కూడా స్కూల్ లో చదువుతూ, టీచర్లు బెత్తాలతో వాయిస్తుంటే చదువుకోవాలేమో.. జునియర్ కాలేజి అన్న మాట కాని, అక్కడ చదువుకుంటే వుండే అనుభూతులు కాని భవిష్యత్తు విద్యార్ధులకి మిగిల్చే టట్లు లేదు ఈ ప్రభుత్వం..

what i said 2 days ago? same thing is happening now.. read today's (23rd June 2009) news paper article..

మరో నాలుగేళ్ళలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అదృశ్యం!!

For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,
Comments are closed