Home » andhra politics

Devender Goud's New Party: NTR?

28. June 2008 by close to reality 0 Comments

New party name : Nava Telangana Rashtram

NTR: దేవేందర్ కి దేవుడు, జయ శంకర్ కి దయ్యం..  

తెలంగాణా కోసం బయటకు వచ్చిన దేవేందర్ గౌడ్ తన పార్టీ ఏంటి అనేది సూచన ప్రాయం గా వెల్లడించాడు.. పార్టీ "నవ తెలంగాణా" .. పాపం పని లేక కేవలం పదవి కోసం బయటకు వచ్చిన దేవేందర్ కి ఇంకా పార్టీ విధి విధానాల గురించి నిర్ణయం తీసుకొనే సమయం దొరకలేదు.. వాస్తవానికి అయితే ఇవన్నీ అలోచించుకొన్న వాడు అయ్యి వుండి, తను అనుకున్నట్లు తెలంగాణా కోసం తానూ ఏదైతే చేద్దాం అనుకున్నాడో అది "తెలుగు దేశం" లో వుండి చెయ్యటం సాధ్యపడదు అని బయటకి వచ్చిన వాడు అయితే విధి విధానాల నిర్ణయం కోసం ఇంత సమయం అవసరమా అని అనుమానం.. వారం దాటి పోయినా ఇంక వూగిసలాట తప్పించి విషయం కనపడట్లా.. టి ఆర్ఎస్  కి వీళ్ళకి తేడా కూడా కనిపించట్లా.. అవే డైలాగులు.. "మేధావులతో చర్చిస్తాం , మేధావుల అభిప్రాయాలతో ముందుకి వెళ్తాం, నవ తెలంగాణా, ప్రజా తెలంగాణా నిర్మిద్దాం అని రొటీన్ డైలాగులు తప్ప..

ఇంతకీ మేధావులు మీకు పరిచయమే కదా.. ఇందులో ఒక్క మేధావి ని గురించి మాత్రం నేను ఇక్కడ చెప్పాలి ఎందుకంటే ఈ రోజు ఆ మేధావి NTR ని విమర్శించాడు.. ఇదేంటి NTR ని ఎవరూ విమర్శించ కూడదా అని అడుగుతున్నారా? అలాంటిదేం లేదు, NTR ని ఇంతకూ ముందు కూడా ఎంతో మంది ఎన్నో విషయాల్లో విమర్శించారు.. అంతెందుకు లక్ష్మి పార్వతి చేతికి జుట్టు ఇచ్చి ఆవిడని వంటింటి నుండి రాష్ట్ర రాజకీయాలు చేయడాన్ని ప్రోత్సాహించడం వంటివి చూసినప్పుడు నేను కూడా విమర్శించిన వాడినే..  కాకపోతే ఈ రోజు ఈ మేధావి విమర్శించిన టాపిక్ ఏంటి అంటే తెలంగాణా ఆత్మ గౌరవాన్ని NTR కించపరిచాడు అని..

మనుషులు రెండు రకాలు.. ఒక రకం కారణ జన్ములు.. NTR కారణ జన్ముడు.. ఇది నేను కాదు అఖిలాంధ్రులు చెప్పుకొనే మాట.. తెలుగుని, తెలుగు వాణ్ణి NTR కించ పరిచాడు అని గుండెల మీద చెయ్యి వేసుకొని ఒక్కళ్ళని చెప్పమనండి .. చిరంజీవి, వై ఎస్ ఆర్, కే సి ఆర్ , విద్యా సాగర్, చంద్ర బాబు  ఎవరైనా సరే.. అంతెందుకు, ఈ మాట దేవేందర్ గౌడ్ ని చెప్పమనండి.. పార్టీలకి అతీతం గా రాష్ట్రాలకి అతీతం గ ప్రతి ఒక్కళ్ళూ వోప్పుకొనే విషయం, "తెలుగు ని , తెలుగు జాతి ని ప్రపంచానికి పరిచయం చేసింది NTR" అని. మరి ఈ జయ శంకర్ తెలుగు వాడేనా, లేక వేరే భాష వాడు "ఆంధ్ర ప్రదేశ్" కి ఇంపోర్టెడ్ ఆ .. ఇంకో రకం మనుషులు జన్మించి నందుకు ఏదో ఒక కారణం వెతుక్కున్నే వాళ్లు.. ఈ "జయ శంకర్" రెండో రకం .. వీరికి విలువలు లెవ్వు.. వీరు గోడ మీద పిల్లి.. నిన్నంటి దాక ' కే సి ఆర్ ', ఈ రోజు 'దేవేందర్', రేపు ఎవడితో పంచుకుంటాడో పక్కని.. పుట్టినందుకు కారణాలు వెతుక్కొనే వీళ్ళకి, ఇంకొకళ్ళని విమర్శించటం కోసం కారణాలు వెతుక్కోటం పెద్ద కష్టమేం కాదు..

కొస మెరుపు.. ** పాపం ఈ జయ శంకర్ కి జ్ఞాపక శక్తి కాస్త తక్కువ అనుకుంటా, లేక పోతే ఇంత తెలివి తక్కువ వాగుడు ఎందుకు వాగుతాడు? జ్ఞాపక శక్తి అని ఎందుకు అన్నాను అంటే, వారం క్రితం వీరి నాయకుడు "దేవేందర్ గౌడ్" కొత్త పార్టీ పెట్టె ముందు, మొట్ట మొదట చేసిన విషయం NTR ఫోటో ని దేవుడి గది లో పెట్టి పూజించి ఫోటో లకి పోజులిచ్చి పత్రికలకి ఇవ్వడం.. ఇది ఇంకా ప్రజల జ్ఞాపకాల నుండి కనుమరుగు అవ్వక ముందే "జయ శంకర్" ఇలా వాగడం.. 
rel  rel
నాకు అర్థం కాక అడుగుతా.. "నాయకుడికి దేవుడు, జయ శంకర్ కి దయ్యం" ఎలా అయ్యడూ అనీ..
దీన్ని బట్టి అర్థం అవుతుంది వీళ్ళందరికీ నిజానికి కావాల్సింది "తెలంగాణా" నా లేక "పేరు ప్రతిష్టలు, పవర్" ఆ  అనేది.. కొద్ది నెలల క్రితం దేవేందర్ గౌడ్ 'కే సి ఆర్' ని గురించి చెప్పిన మాట ఇప్పుడు నేను ఈ 'జయ శంకర్' కీ చెప్పాలనుకుంటున్నా.. "రోడ్డు మీద ఏనుగు వెళ్తుంటే వందల కొద్దీ కుక్కలు మొరిగినా ఏనుగు కి అయ్యేది ఏమి లేదు, ఈ కుక్క ఏనుగు ఎన్నటికీ కాదు".. ఇక్కడ నేను కుక్క ని కించ పర్చట్లేదు.. నాకు కుక్కలు చాల చాల ఇష్టం.. కాకపోతే, దేవేందర్ చెప్పిన దాన్ని మళ్ళీ చెప్తున్నా అంతే..

Share or Bookmark this post…
  • E-Mail
  • IndianPad
  • Digg
  • del.icio.us
  • Google
  • Technorati
  • StumbleUpon
  • Facebook
  • TwitThis
  • feedmelinks
  • Reddit
For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,
Bookmark and Share

Add comment




  Country flag

biuquote
  • Comment
  • Preview
Loading