రైతులకి పొలాల్లో సాగు నీళ్ళ కరువు..
నాలుగ్గంటలు మోటారుతో నడుపుదామంటే కరెంటు కరువు..
బయట విత్తనాల కరువు..
ఇంటి ముందు కళ్లాపికీ నీళ్ళ కరువు..
ఇంట్లో తాగు నీళ్ళు కరువు..
ఇంటి వెనుక పాడి గేదేలకీ నీళ్ళు కరువు.. పచ్చ గడ్డి కరువు..
కొట్లో కంది పప్పు కరువు..
సన్న బియ్యం కరువు.. వంట గ్యాసు కరువు..
మోము పై చిరునవ్వు కరువు.. కంటి నిండా నిద్ర కరువు..
రాష్ట్రమంతటా బెల్టు షాపులకి లేదు కరువు.. కల్లు కొట్లకీ లేదు కరువు..
మూల మూలా దొరికే మందుకీ, కల్లుకీ లేనే లేదు కరువు..
అడ్డగోలు, అదుపు లేని ధరలకూ లేదు కరువు..
ప్రేమించక పోతే గొంతులు కోసే వాళ్లకి లేదు కరువు, వాళ్ళు వాడే బ్లేళ్ళకీ లేదు కరువు..
నీళ్ళు నీళ్ళు అంటూ, జల యజ్ఞం జపం చేస్తూ బాజప్తుగా దోచుకున్న బెవర్సులకీ లేదు కరువు..
వుప్పులూ పప్పులూ గోదాముల్లో, గెస్టు హౌసుల్లో దాచి రెట్లు పెంచి అమ్ముతున్న లుచ్చాలకీ లేదు కరువు..
పొరుగు రాష్ట్రాల డ్యాముల కింద పవరు ప్రాజెక్టులు కట్టుకున్న పెద్ద వెధవలకీ లేదు కరువు..
మరి కరువు ఎవరికీ.. ఇంకెవరికి? వోట్లు వేసి గెలిపించిన నీకూ నాకూ.. చూస్తున్న నీకూ నాకూ మనశ్శాంతి కరువు..
అందుకేనా ఈ ఆత్మహత్యలు?
ఎవడాడు చెప్పింది? మీకు వొళ్ళు బలిసి తాగి చస్తున్నారు..
సరే వొప్పుకుంటా, మరి అన్ని రకాల కరువులూ నాలాంటి సామన్యుడికేనా?
నాయకులకి, పెద్దోళ్ళకీ కరువు అనేది రాదా?
ఎవడాడు చెప్పింది?
పాపం మన ముఖ్యమంత్రికి ప్రస్తుతం దొబ్బి తవ్వుదామంటే గనుల కరువు..
రోజు అబద్ధాలు రాయందే బడ్డీ కొట్టు స్టాండు మీదకేక్కని 'సాక్షి' పేపరుకి కొత్త అబద్ధాల కరువు..
అడ్డు వచ్చిన వోళ్ళని 'ఎసేయ్యండి రా' అని చెప్పే ఫ్యాక్షనిస్టులకి ప్రస్తుతం అడ్డు వచ్చే వాళ్ళు కరువు..
కే సి ఆర్ కి అనుచరులు కరువు..
చిరంజీవికి పార్టీలో వుండే వాళ్ళు కరువు..
చేసే చంద్రబాబు నాయుడు కి అధికారం కరువు..
జయ ప్రకాష్ నారాయణ కి బాడి ఏంటి, సరి అయిన బ్రేయినూ కరువు..
విజయశాంతిని దేకే వాడు కరువు..
బొత్స కుటుంబానికి పంచుకోడానికి నియోజక వర్గాల కరువు..
జే సి , జానా లకి మంత్రి పదవి కరువు..
ఉగ్రవాదులకి వాళ్ళని ఎదుర్కునే దమ్మున్న ప్రభుత్వాలు కరువు..
పెద్ద పోలీసు అధికారులకి ఇంట్లో బంట్రోతులు కరువు..
మాజీ లయినా ఎం ఎల్ ఎ క్వార్టర్లు వదలని నాయకులకి నగరంలో ఇల్లు కరువు..
నల్లపురేడ్డికీ, నాగి రెడ్డికీ ఇలాంటి సమయం లో చంద్రబాబుకి లేఖలు రాయడానికి పెన్నుల్లో ఇంకు కరువు..
..
..
..
..
ఇలా ఎన్నో ఉన్నాయి, కాకపోతే ఇంతవరకీ నేను చెప్పింది ఒక ఎత్తు, ఇప్పుడు చెప్పబోయ్యేది మరొక ఎత్తు..
..
..
ఇలాంటి కష్ట కాలంలో,
ఇంత జరుగుతున్నా దున్నపోతుల మీద వాన పడ్డట్లు, వూపుకు పోయే మన మంచి ఎం.ఎల్.ఎ లకి
"మగధీర సినిమా టికెట్లు కరువు" వాళ్లకి ఎలాగూ లేదు, కనీసం మనమన్నా సిగ్గు పడదాం..
For movie news and free telugu songs download, visit
anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,