కోర్టులు అక్షింతలు పెట్టినా, పౌర హక్కుల నాయకులు పొర్లి పొర్లి యాగీ చేసినా ఈయన గారికీ, ఈయన మంత్రి వర్గ సహచరులకూ పట్టనే పట్టదు.. ఈయన అనుకుందే న్యాయం, ఈయన చేసేదే చట్టం.. ఎవరన్న అభ్యంతరం చెబితే సహించలేరు..
చావు తప్పి కన్ను లొట్ట పొయ్యే విజయమే అయినా (దీనికి పనికి రాని ప్రజా రాజ్యం పార్టీ కి కృతఙ్ఞతలు) అధికారం చేపట్టిన మర్నాటి నుండే అసలు స్వరూపం బయట పెడుతున్నారు.. మాజీ డి.జి.పి అనవసరపు వాగుడుకి ఎలెక్షన్ కమీషన్ తో అక్షింతలు పడ్డా, నడిచేది మా రాజ్యమేగా నని ఒకడికి నేను చెప్పేది ఏంటి అని చెప్పా పెట్టకుండా విదేశాలకు వెళ్లి తాత్కాలికంగా ఉద్యోగం ఊడగోట్టించుకొన్నా ఈయన గారికి ఆయనే ముద్దు, అందుకే కుర్చీ ఎక్కిన తెల్లారే తిరిగి తన తొత్తులని అందరినీ పిలిచి పనిలో పెడుతున్నాడు..
సింహం ఎప్పటికీ సింహమే అన్నట్లు, నెల నాళ్ళు మాత్రమె రాష్ట్ర డి.జి.పి గా ఉన్నా, చట్ట వ్యతిరేకులకి.. ప్రత్యేకించి డబ్బు వల్ల ఒళ్ళు కొవ్వేక్కిన ప్రతి వాడికీ పార్టిలకి అతీతంగా ఉచ్చ్చలు పోయించాడు ప్రస్తుత డి.జి.పి మహంతి. ఇప్పటికిప్పుడు రాష్ట్రం మొత్తం వోటింగ్ పెట్టినా, నూటికి డెబ్బయ్యికి పైగా ప్రజలు మాకు మహంతి నే కావాలి అంటారు.. మరి ఇంత హడావిడిగా ఇప్పుడు మహంతిని మార్చాల్సిన అవసరం వై.ఎస్.ఆర్ కి ఎందుకు వచ్చిందో.. అయినా ప్రజాభీష్టాన్ని మన్నిన్చాలంటే మెజారిటి ప్రజల చేత ఎన్నుకోబడితే గదా.. 65 మంది ఈయన్ని వద్దన్నారు, 35 మంది ఈయనే కావాలి అన్నారు.. సుడి బాగుండి సీటులో కూర్చున్నారు.. ఇంక ఈ అయిదు ఏళ్ళూ ఆ 35 మంది కోసం వాళ్ళ రాజా వారు ఏమయినా చేస్తారు.. అవునా వై.ఎస్.ఆర్ సారూ.. ఈరోజు రాజా వారి అనుగ్రహం పొందిన వారి వివరాలు..
డి.జి.పి : ఎన్.ఎస్.పి యాదవ్.
తూర్పు గోదావరి ఎస్పీ: నాగి రెడ్డి.
(image:eenadu)
చూస్తూ పోదాం ఈ అయిదేళ్ళలో ఇలాంటివి ఇంకా ఎన్ని జరుగుతాయో, ఇది మొదటి రోజే కదా..
డి.జి.పి. మహంతి గారికి, విశాఖ ఐ.జి : వెంకటేశ్వర రావు, చారు సిన్హా స్థాన చలనం ( ఇంకా ఎ భాద్యతా అప్పగించబడలేదు): ఏం చేస్తాం చెప్పండి ప్రజలకి మంచి చేసే పోలీసులు ఈ ప్రజలకి ఎంతో ఎంతో మంచి చేసే ప్రభుత్వానికి అవసరం లేదంట.. కాస్త ఓపిక పట్టండి, రేపు ఎ ఫాక్షనిస్టో మా రాష్ట్ర హోం మంత్రిగా వచ్చినా ఆశ్చర్యం లేదు.. అప్పుడు మీ పోలీసులతో ఆయన ఫుట్ బాల్ ఆడుకుంటుంటే.. అహో.. ఏమి ఆంధ్రము?
also read సుబ్బారావు, మహంతి లే నిజమైన హీరోలు

For movie news and free telugu songs download, visit
anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,