Home » 2009 elections | 2009 Parliament Elections | Andhra | andhra politics | andhra pradesh | Business | Chiranjeevi | GHMC elections | Headline | India | Indian Politics | Rayalaseema | Technology | Telangana

మతమౌఢ్యంలా మారనున్న ఆంధ్ర - తెలంగాణ అంశం

6. February 2010 by viswamitra 1 Comments

 "Development can never substitute independence,self-rule, and self-respect". కెసిఆర్ తరచు అనే మాట ఇది. తెల్లవాడు వాడి సౌకర్యం కోసం ప్రాంతీయ అభివృద్ధి కోసం కృషి చేశాడు. అంతమాత్రాన  మనం స్వాతంత్ర్యం వద్దనలేదు! ఇలా ఉంది మన కెసిఆర్ వాదన. అదే సమయంలో అన్నదమ్ముల్లా విడిపోదాం అంటున్నారు. ఇక్కడ స్థిరపడ్డ తెలంగాణేతరులకి అన్నిరకాలుగా మేము భరోసా ఇస్తం అంటున్నారు. ఆయన ఉద్దేశ్యాన్ని ఇప్పుడు కేంద్రంపై కూడా రుద్దడానికి సిద్ధపడ్డారు. కమిటి పేరుని తెలంగాణ ఏర్పాటు కమిటి అని ప్రకటించాలట. అదేదో వాహనాల నంబర్ ప్లేట్ అనుకుంటున్నట్టున్నారు (దాని దగ్గరే భరోసా లేదు).

 

ఇప్పుడు తెలంగాణ వారి కంపెనీల్లో ఆంధ్ర ప్ర్రాంతం వారు పనిచేస్తున్నారు. రాజ్ గోపాల్ కార్యాలయాల్లో ఎందరో తెలంగాణ ప్ర్రాంతం వారున్నారు. తెలంగాణవాది చుక్కా రామయ్య దగ్గర కోచింగ్ కోసం ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ కి వచ్చి ఉండేవారెందరో! తెలంగాణ విద్యా/పారిశ్రామికవేత్తలయిన బి.యన్.రెడ్డి, వివేకానంద్ వంటి వారి వద్ద ఎందరో తెలంగాణేతరులు పనిచేస్తున్నారు. తెలంగాణ వారి ఇళ్ళలో అద్దెకు ఉండే సీమాంధ్రులు, వారి మీడియా, వైద్య సంస్థల్లో పనిచేస్తున్న తెలంగాణ వారు, పరస్పర  బంధుత్వాలు...ఇలా ఎన్నో! ఇవన్నీ చెప్పుకోడానికి మాత్రమే బావుంటాయని వారంటారు...చుక్కా రామయ్యతో సహా! కళ్ళముందు కనబడుతున్న వాస్తవాల్ని "చెప్పుకోడానికి" అని ఎలా అనగలరు?

 

నాణెం మరోవైపు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. ఇక్కడి సంస్కృతి, వేష భాషలపై చిన్న చూపట. ఇక్కడి బోనాల్లో పాల్గొనే సీమాంధ్రులు ఎందరో. ఇక్కడ పుట్టిన వారికి ఇక్కడి భాష, యాసలు సులభంగా వచ్చేస్తాయి. "ఉరికి వస్తున్నా" అనే నా మాటని సీమకి చెందిన నా స్నేహితుడు సందర్భం వచ్చినప్పుడల్లా తమాషాగా అంటూంటారు. అంతమాత్రాన సంస్కృతి మీద దాడి అంటే ఎలా? సినిమాల్లో ఎందుకు అంటారు. ఇప్పటి పాత్రలనే తీసుకుంటే జయప్రకాష్ రెడ్డిది ఎక్కువగా నెల్లూరు, చిత్తూరు యాస ఉంటుంది. కొన్ని పాత్రల శ్రీకాకుళం భాష ఇతర ప్ర్రాంతాలవారికి తమషాగా ఉంటుంది. దిల్ రాజుది ఇప్పుడు పరిశ్రమలో తిరుగులేని స్థానం, హస్తవాసి బాగున్న నిర్మాతల్లో ముఖ్యులు. ఉత్తరాంధ్రకి చెందిన పూరి జగన్నాధ్ చిత్రాలకి పబ్లిసిటి డిజైనర్, తెలంగాణ వాసి ధని ఏలె. వరంగల్ కి చెందిన వైద్యులు గోపిచంద్ దేశవ్యాప్తంగా పేరు గడించారు.   విషయం ఉండాలేగాని వాడే ప్రాంతం అయితే ఏంటి?  అందాక ఎందుకు... కెసిఆర్ ప్రసంగిస్తుంటే ఏ ప్రాంతం వారూ తొందరగా ఛానెల్ మార్చరు.

 

 ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్ని రెచ్చగొట్టి విడదీస్తే ప్రాధాన్యతలు మారిపోతాయి. కలిసున్నప్పటికీ ప్రతి చిన్న సమస్యా ప్రాంతీయత అనే రంగు పులుముకుంటుంది. ప్రతి చిన్న విషయాన్నిఇప్పుడు ఒక మతానికో, కులానికో ముడి పెట్టి చూస్తున్నట్టుగా అప్పుడు ప్రాంతానికి ముడిపెట్టి చూస్తారు. పనులు, కాంట్రాక్ట్స్, చదువులు, వృత్తులు ప్రతిభని వదిలి ప్రాంతాలపై స్వారీ చేస్తాయి. మన కులం వాడనో, మన ప్రాంతం వాడనో పనికి మాలిన వాళ్ళకి కీలక పదవులిచ్చి వెనుకబడి పోయిన సీమాంధ్ర ఇరుకు వ్యాపారులకి రాష్ట్రంలో కొదవలేదు. ఇందుకు ఒక రకంగా తెలంగాణ వాళ్ళు కొంత నయం.

 

 ఇరు వర్గాలు కలసి ఉండి, మానసికంగా విభజించబడ్డపుడు, కుటుంబ కలహాలు, ప్రమోషన్స్ వగైరా వ్యక్తిగత అంశాలు స్థానిక సమశ్యలవుతాయి. ఆచారాలు, నమ్మకాలు ప్రాంతాలవారీగా చీలిపోతాయి. ఇప్పుడు బాసర, వేములవాడకి రాష్ట్రవ్యాప్తంగా భక్తులు వస్తున్నా, అక్కడి కొన్ని అవాంఛనీయ శక్తులు విజయవాడ కనకదుర్గ ప్రసాదాన్ని వద్దనుకునే దౌర్భాగ్యం నెలకొని ఉంది. ఈ విభజన అనే విషయం ప్రాంతీయతను దాటి ఒక మడికట్టుకునే మతంలా మారి అన్నదమ్ముల విభజన కాస్తా సవతి పిల్లల ఘర్షణలా నిరంతరం రగిలే ప్రమాదం ఉంది. ఈ ఘర్షణలో అందరికంటె ఎక్కువగా అయోమయానికి గురై నలిగిపోయేది హైదరబాద్.

For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,

Comments (1) -

BKR
United States BKR said:

hope this five member committee will put an end to this issue as soon as possible. After that there won't be any chance for KCR to use his foul mouth.

Comments are closed