Home » 2009 elections | India | Indian Politics | andhra politics

మెడకాయ మీద తలకాయ లేని మాటలు..

21. April 2009 by close to reality 0 Comments

పేరుకి పెద్ద నాయకులు.. కాని వీళ్ళు కొన్ని సార్లు మాట్లాడే మాటలు వింటే వొళ్ళు జలదరించి వాంతులు అవుతాయి మనకి.. మచ్చుకి కొన్ని మీకోసం..
"ప్రభాకరన్ ఉగ్రవాది కాదు.. అతను నాకు మంచి మిత్రుడు" .. *కరుణానిధి*
"ప్రభాకరన్ ఉగ్రవాది కాదు అంటే, మరి కసబ్? అతనూ బహుశా ఎ ముషరాఫ్ కో మంచి మిత్రుడే.." *ఎనిగళ్ళ.నెట్*

"హైదరాబాద్లో మనం విదేశీయులం అవుతాం, వీసా తీసుకొని వెళ్ళాలి.. టి.డి.పి. వేర్పాటువాదులతో జత కట్టింది" .. *YSR*
"ఐదేళ్ళ క్రితం టి.ఆర్.ఎస్. సమైఖ్యవాద పార్టీనా మీ నాయకత్వంలో కూటమి ఏర్పడినప్పుడు? అందుకేనా సొమ్ములన్నీ కడపకి కట్ట గట్టి పంపిస్తున్నారు? ముందు జాగ్రత్తా?" *ఎనిగళ్ళ.నెట్*

"అశ్లీల సినిమాల్లో నటించిన రోజాకి టికెట్ ఇవ్వడం చంద్రబాబు చౌకబారుతనం.. రోజా బ్లాక్మెయిల్ చేసి టికెట్ తెచ్చుకోండి".. *శోభా రాణి* (ఈవిడేవరు అని అడక్కండి..పి.ఆర్.పి. మహిళా విభాగం నాయకురాలు)
"ఆడరాని భోగంది నేల సరిలేదంది అంట.. ఈవిడగారికి టికెట్ కి దిక్కు లేదు గాని.. అది సరే.. మరి నిన్న పవన్ కళ్యాణ్ ఎ రోజు కైనా రోజా పి.ఆర్.పి. లోకి రావాల్సిందే అని ఎందుకన్నట్లు? ఎన్నికల తర్వాత పి.ఆర్.పి. అశ్లీల చిత్రాల నిర్మాణం గాని చేపట్టబోతుందా ఏంటి?" (పాపం రోజా..) *ఎనిగళ్ళ.నెట్*

"శ్రీలంక తమిళులకి ఇండియా మద్దతు ఇవ్వట్లేదని ఇండియన్ హై కమీషన్ ముందు మలేషియన్ తమిళుల గోల"  ....*మలేషియన్ తమిళులు*
"అదేంటి? మీరు ఇండియన్ లు కారుగా.. మీకు మలేషియా పాస్ పోర్ట్ లు వున్నాయి, మలేషియన్ పౌరులు మరి మీ ప్రధాని ని అడక్కుండా మా ప్రధాని ని అడుగుతారెంటి? ఓహ్! మీ వాళ్ళని అడిగితే ISA చట్టం కింద కేసు లేకుండా బొక్కలో తోసి ఎవడూ అడగటానికి కూడా లేకుండా అయిపోతాయి మీ బతుకులు.. అందుకే మా ప్రధాని అయితే మంచోడు.. నోట్లో మాట బయటకి కూడా చెప్పే స్వాతంత్ర్యం లేనోడు అనా మీ ఎదవ ధైర్యం?" *ఎనిగళ్ళ.నెట్*

For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,
Comments are closed