Home » Close To Reality | andhra politics

జే పీ గారికి నా ప్రశ్న ..

23. July 2009 by close to reality 3 Comments

by అజయ్ కొల్లా ...

నమస్కారం జే పి గారు ,
మిమ్మల్ని  నా మనసులోని కొన్ని అంతు చిక్కని ప్రశ్నలు  అడగాలని వుంది ... మీకు కనుక వీటికి సమాధానం దొరికితే ఎక్కడ అయినా నేను చర్చకు సిద్ధం ...

మీరు చెప్పిన కొత్త రాజకీయం అనే పదానికి అర్ధం వెతికాను నాకు దొరకలేదు .. అందుకే మీ దగ్గర తేల్చుకుందాం అని ఈ చిన్న ఆశ..
1) మీరు చెప్పినట్లు కుల రాజకీయం , డబ్బు రాజకీయం , వారసత్వ రాజకీయం మీరు చేయలేదా ??  ఒక వేళ చేయలేదు అంటే మీరు కమ్మ వారి వోట్లు ఎక్కువగా వున్నా కుకట్ పల్లి లో ఎందుకు పోటీ చేసారు..? ఇక డబ్బు రాజకీయం అంటారా మీ మల్కాజ్గిరి అభ్యర్ధి రత్తయ్య గారు డబ్బులు మీ నియోజక వర్గం లో పంచిన విషయం మీకు తెలియక పోయిన ఇక్కడ జనానికి తెలుసు ...
ఇక వారసత్వ రాజకీయం అంటే ఒకరి తరుపున వారి భార్య , తమ్ముడు మరియు ఇంటిల్ల పాది ప్రచారం చేయడం, వీరి భాద్యతలని వారు చేపట్టటం కాదా ?ప్రస్తుతం మీ నియోజకవర్గ బాధ్యతలు మీ తమ్ముడే చూడడం అది కదా వారసత్వ రాజకీయం ... మీరే ఆత్మ సాక్షిగా ఆలోచించండి ...

2) ఇక మీరు చెప్పిన ఇంకో మంచి మాట అందరికి ఉచితం గా చదువు, ఆరోగ్యం అందరికి ఉచితం గా అందరికి అందుబాటు లో వుండాలి .. చదువు చెప్పాలి కాని  చదువు అమ్మ కూడదు.. చదువుకోవాలి గాని చదువు కోన కూడదు అన్నారు .. చాల మంచి మాట .కాని మీ అభ్యర్ధి రత్తయ్య గారు చేసింది ఇప్పటి వరకు చదువు మీద వ్యాపారం కాదా ?... మీరు మూడు జిల్లా లలో పదవి బాధ్యతలు చేపట్టినపుడు అక్కడ ఒక్క స్కూల్ ని అయిన బాగు చేయించి అక్కడ మీ పిల్లల్ని ఎందుకు చదివించలేక పోయారు ... అప్పుడు చేయకుండా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల మీద ఎందుకు అన్ని విమర్శలు ....అది అంత అధికారం కోసం కాదా ?

౩) మీరు ఇంకో మాట చెప్పారు తప్పుని చూసి ఎదురించకుండా వుండడం కూడా తప్పే నని ... మరి అవినీతి సొమ్ముతో పేపర్ పెట్టిన సాక్షి ఓపెనింగ్  కి ఎందుకు అటెండ్ అయ్యారో మీరే చెప్పాలి ...చెడు వినరాదు చెడు చూడరాదు చెడు మాట్లాడరాదు అని చెప్పిన గాంధీ సిద్దాన్తాలని నమ్ముతూ ఆయన పుట్టిన రోజు నాడు పెట్టాం పార్టీ అని చెప్పుకునే మీకు అది చెడు అని మీకు తెలియదా ?

4) మీరు గెలిచిన రోజు అధికార మార్పిడి కోసం కుట్టిన కూటమి లని వోడించి మంచి తీర్పు ని ఇచ్చారు అని చెప్పారు ... మంచి తీర్పు అంటే డబ్బులు పోయాయి అందుకే వోక్సు వ్యాగను కంపెనీ రాలేదు అని చెప్పిన మంత్రి ( బొత్స ) ఫ్యామిలీ కి 4 గెలవడమా ?  లేక రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటుంటే మందు తాగి చస్తునారు అన్న మంత్రి ( జే సి ) గెలవడమా ? లేక జనం ఎరువులు కోసం కష్టపడుతుంటే దొంగలు ఎత్తుకెళ్ళారు అన్న మంత్రి ( రఘువీర ) గెలవడమా? జల యజ్ఞం పేరుతో ధన యజ్ఞం చేసిన మంత్రి ( పొన్నాల ) 44 వోట్లతో గెలవడమా ? లేక జనం 35 రూపాయలకి బియ్యం కొనలేక పోతున్న పట్టించుకోని మంత్రి ( కాసు )గెలవడమా?  ఏంటో మీరే చెప్పండి ... ఇదంతా మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అంటే మీ వల్ల 24 సీట్లు ఓడిపోవడం వల్ల ఈ జనం ఎంత బాధ పడాలో అర్ధం కాక ఈ అయిదు సంవత్సరాలలో  జనం పడబోయే బాధని దృష్టి లో వుంచుకుని  రాస్తునాను ...
5) మీరు ఇంకొక విమర్శ చేసారు ...  సినిమా హీరోలు తిరిగి జనాన్ని మభ్య పెడుతునారు అని .... అది తప్పు అయితే అవ్వొచ్చు .. కాని మీరు ఏమైనా కరెక్ట్ చేసారా ? మీరు ఆ గూటి లో పక్షి లానే చేసారు గా ? ఏమ్, గుర్తు రావడం లేదా ఏమి చేశానా అని ... అదేనండి రాజమౌళి మరియు శేఖర్ కొమ్ముల సినిమా వాళ్ళు కదా ? ఈ విషయాలు తెలియక కనీసం మిమ్మల్ని అయినా గెలిపించారు జనం ..  త్వరలోనే మిమ్మల్ని నిలదేసే రోజు వస్తుంది చూడండి ...
6) EMRI అనే సంస్థలో మీరు మరియు అబ్దుల్ కలం గారు , థాముస్ గారు , రాజు రెడ్డి గారు , రామ లింగరాజు గారు వుండగా సత్యం కుంబకోణం బయట పడిన వెంటనే అందరు ఆ విషయాన్ని తప్పు బట్టి బయట కు వెళ్ళగా ఇప్పటికి మీరు ఎందుకు దాంట్లో కొనసగుతునారు ?  అంటే అబ్దుల్ కలం గారికి తప్పు అనిపించింది మీకు ఒప్పు అనిపించిందా ? 

7)జే పి గారు అసలు మీరు ఎ  పని అయిన పూర్తిగా చేయగలరా ?
నాకు ఈ ప్రశ్న ఎందుకు వస్చింది అంటే కలెక్టర్ అంటే ఒక జిల్లా కి ప్రధమ పౌరుడు లాంటి వాడు .. ఆ జిల్లా లో అతను చేయాలి అనుకుంటే ఎంత మంచి పని అయిన చేయగలరు ... అలాంటిది ఏదో కష్టం వస్చింది అని నేను చేయలేను అని వచ్చేశారు అంటే ఇప్పటి వరకు చేసిన IAS & IPS లని అవమానించి నట్లు కాదా ? ఎంతో మంది మంచి పనులు చేసి మంచి నేమ్ తెచుకున్న వాళ్ళు లేరా ? మరి మీరు  ఒక్కరే ఎందుకు పారిపోయి వచ్చారు?
మరి అలంటి మిమ్మల్ని మనలో కొంత మంది cm ని చేసేస్తే రాష్ట్రాన్ని వుధరించాలి అని అంటునారు ... రేపు ఏమినా పదవి ఇస్తే ఏమినా కష్టం వస్చినపుడు పారిపోకుండా వుంటారు అని  నమ్మకం ఏమినా వుందా ?

8) మీరు మీ పార్టీ మొదటి సారిగా ఎన్నికలలో పోటి చేసింది వారసత్వ రాజకీయలకి వ్యతిరేకంగ అని చెప్పి ఖైరతాబాద్ మరియు తెర్లాం లలో జరుగిన ఉప ఎన్నికలలో ... అప్పుడు మీరు మీ పార్టీ తరుపున అభ్యర్ధులని నిలబెట్టారు .. అలాంటిది ఈ ఎన్నికలలో వారసత్వ రాజకీయాలతో ఎన్నికలలో నిలబడిన వై ఎస్ జగన్ గారి మిద మరియు ఆ పార్లమెంట్ పరిధి లోని అసెంబ్లీ ౭ సిగ్మెంట్స్ లో ఎక్కడ మీ అభ్యర్ధులను ఎందుకు పెట్టలేదో చెప్పగలరా ...

గాంధీ పేరు చెప్పి కాంగ్రెస్ ని సోనియా గారికి ,  ఆమె చెప్పినట్లు వినే దేశాన్ని పాలిస్తున్న మన్మోహన్ గారికి మీరు సలహాదారులు గ చేసారు .. ఆ సలహాలలో ఒక్క రోజయిన వారసత్వ రాజకీయాల గురించి వారికీ సలహా ఇస్చారా ? ఎందుకంటే మేరు దెస ప్రజల బాగు కోసం పాటు పడుతునం అని చెప్పారు గనుకు ఈ ప్రశ్న వేస్తునాను ... నిజం గ మీరు టి వి లలో కనిపించి చెప్పే మాటలు మీ మనసు లో నుండి వశ్చి వుంటే కచ్చితంగా ఈ సలహా ఇచ్చి వుండే వారు .

 మెత్తగా నాలుగు  మంచి మాటాలు  టీవీ  లో చెప్పి జనం ని మభ్య పెట్టి కాంగ్రెస్ కి మరల అధికారం కట్ట బెట్టిన మిమ్మల్ని  ఈ జనం వురికే ఒధలరు ... మంచి చేసే వారిని ఎలా ఆదరిస్తారో చేసు చేసిన వారిని అలానే తరిమి కొడతారు చూస్తూనే వుండండి .. ముందు వుంది అసలైన పండుగ ...

ప్రతి విషయాన్నీ తప్పు తప్పు అంటారే  గాని ఎప్పుడైనా ఆ తప్పు ని ఎలా చేస్తే మంచి అవుతుందో చెప్పరా ...మీకు నిద్ర రావాలి  అంటే ఆ రోజు ఏదొ ఒక దాన్ని విమర్శించాలి అనుకుంట ...మీ పద్ధతి దయ చేసి మార్చుకోండి ..మీరు దయ చేసి ఒక పని తప్పు అని చెప్పేటప్పుడు ఏమి చేస్తే కరెక్ట్ ఓ కూడా చెబితే సామాన్య జనానికి అర్ధం అవుతుంది ...
మీరు నిజంగా మనసుతో ఆలోచించి వీటికి సమాధానాలు చెబితే నేను విజయం సాధించినట్లే...

 

ఇట్లు ,
అజయ్ కొల్లా ...

9885452024...

For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,
Share or Bookmark this post…
  • E-Mail
  • IndianPad
  • Digg
  • del.icio.us
  • Google
  • Technorati
  • StumbleUpon
  • Facebook
  • TwitThis
  • feedmelinks
  • Reddit
Bookmark and Share

Comments

Murthy
United States Murthy said:

Ajay, Fantastic letter man.. I really enjoyed reading it and i feel it should reach wider audience.., why don;t you publish in other websites too. Just to garner much support. Very good information article, I too have the same feelings about this guy JP. He killed prospects of TDP and of too much an hypocryte.

Thanks
Murthy

rr
United States rr said:

Please don't talk like CBN. Loksatta candiate contested against Jagan in Kadapa

ha ha ha ha
United States ha ha ha ha said:

ee yedupanthaa congress gelichinandukaa leka tdp odipoyinandukaa

Add comment




  Country flag

biuquote
  • Comment
  • Preview
Loading



Your Ad Here