రాజకీయంగా ఎంత ప్రయత్నించినా, మద్ధతు కూడగట్టినా ఒక్క పదవీ రాలేదు. కెసీఆర్ తో దీక్షలు చేయించినా రోశయ్య అస్థిరపడలేదు. రిలయన్స్ పై దాడి కూడా అస్థిరపరచలేక పోయింది. మతకలహాలు ఔట్ డేట్ అయిపొయ్యాయి. ఇక యాత్ర... అదీ ఉపఎన్నిక ముందు. ముఖ్యమంత్రి బలవంతంగా ఆపితే, సానుభూతి సంపాదించవచ్చు. పోన్లే అని వదిలేస్తే, ప్రయాణం-రైల్ రోకో డ్రామాతో అల్లర్లు సృష్టించవచ్చు. కేసీఆర్, ఇతర అనుబంధ సంస్థలు ఉద్వేగాల్ని రెచ్చగొట్టి వదిలేయడంతో ప్రాణ నష్టం, ఆస్థి నష్టం... జనసామాన్యానికి ఇక్కట్లు. ఏదేమయినా...డామిట్, కథ మళ్ళీ అడ్డం తిరిగింది. సాక్షాత్తూ హోమ్ మంత్రి గారు పరోక్షంగా యాత్రకి మద్ధతిచ్చినా రోశయ్య చాణక్యం ముందు ఏదీ పనిచెయ్యలేదు. నిజాయితీ ఉన్న అధికారులకి స్వేచ్ఛనిచ్చి, కుక్కలు చించిన ప్రాంతంలా ఉన్న రాష్ట్ర్ర ఆర్థిక, రాజకీయ చిత్రాన్ని కొంతవరకు చక్కబరుస్తున్న ఆయనే ప్రస్తుతానికి భరోసా!
కొసమెరుపేమిటంటే స్థబ్దుగా ఉన్న మీడియాకి మళ్ళీ పండుగ. డ్ర్రామానాయకుల పెట్టుబడులు ఉన్న అన్ని మాధ్యమాలు మసాలా దట్టించిమరీ కథనాలు మొదలుపెట్టాయి.
For movie news and free telugu songs download, visit
anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,