Home » India | Indian Politics

స్విస్ బ్యాంకులలో మూలుగుతుంది ఎవడి అబ్బ సొమ్ము?

6. April 2009 by close to reality 2 Comments
గత కొన్ని సంవత్సరాల క్రితం, సరిగ్గా చెప్పాలంటే ఎన్నో ఏళ్ల క్రితం ఒక సారి ఈ స్విస్ బ్యాంకు ఖాతాల గురించి అంతా మాట్లాడుకున్నాం.. తర్వాత షరా మామూలే, ఎప్పటిలానే మళ్ళీ మనమంతా దీని గురించి మర్చిపోయ్యాం.. జి-20 సమావేశాల పుణ్యమా అని మళ్ళీ ఇప్పుడు స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో మూలుగుతున్న ఇండియన్ల డబ్బు గురించి ప్రస్తుతం ఇండియా అంతా టాక్.. సమావేశాల్లో మాట్లాడుకొన్న ఒక అంశం, సమాజమంతా మాట్లాడుకొనే విధంగా చేసింది మాత్రం నిస్సందేహంగా 'బి.జే.పి'..
గత ౩౦ సంవత్సరాలు గా అభివృద్ధి చెందుతున్న, చెందుతున్న అనే వింటున్నాం కాని, చెందిన దేశం అని వినేది ఎప్పుడు? ఎవడికి వాడు కోట్లు  నొక్కి బయటి దేశాల బ్యాంకుల్లో నిల్వ చేసి వాళ్ళని బాగు చేస్తున్నట్లుంది కాని, మన దేశానికీ ఏది ఉపయోగం? లెక్కల ప్రకారం, అన్ని ఇతర దేశాల వాళ్ళు నిల్వ చేసిన మొత్తాలని కలిపితే కూడా మన ఒక్క దేశం వాళ్ళు దోచి దాచినంత లేదు.. ఇది అంతా ఎవడి డబ్బు? ఈ లెక్కన చూస్తే, బ్యాంకు వ్యాపారాలు చెయ్యటం, గడియారాలు అమ్మటం అనే రెండు ప్రధాన అంశాల ఫై ఆధార పడి మనకన్నా బ్రహ్మాండంగా వృద్ది చెందిన స్విట్జర్లాండ్ కేవలం ఇండియా వాళ్ళ డబ్బులతో బాగు పడింది అనటం అతిశయోక్తి కాదేమో..

నిన్న హైదరాబాద్లో నరేంద్ర మోడి అడిగినట్లు, ఒక దేశ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తే ఖాతాదారుల వివరాలు ఇవ్వడానికి సిద్దం అని స్విట్జర్లాండ్ చెప్పినా కూడా ఇంకా ఆ వివరాలు తెప్పించే ఆలోచనలో లేని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఏమనాలి? మనకందరికీ తెలుసు 'మన్మోహన్ సింగ్' గారికి ఇలా దోచి దాచే అలవాట్లు లేవని, కాని ఇంకా అతను ముందడుగు వెయ్యకపోటానికి వెనుక కారకులు ఎవరో?  గతం లో బోఫోర్స్ కుంభకోణం అప్పుడు రాజీవ్ గాంధీ పేరు అతని స్విస్ ఎకౌంటు విలువల గురించి దేశం అంతా మార్మోగిపోయింది.. తర్వాత మళ్ళీ మామూలే.. 
సంపూర్ణ మద్య నిషేధం లాంటి ఉద్యమాల్ని చివరికంటా నిలిపిన 'ఈనాడు' లాంటి మీడియా వాళ్ళు ఎవరైనా పుణ్యం కట్టుకొని స్విస్ ఎకౌంటు లున్న 'దొంగ నా డుడుకుల' వివరాలు ఇండియాకి వచ్చేంతవరకు దీనికి ఒక ఉద్యమ రూపం ఇచ్చి నిలబెడితే ఒక సగటు భారతీయుడి గా వాళ్ళ మేలుని జీవితాంతం గుర్తున్చుకొంటాం మరియు వాళ్ళ మేలుని భావి తరాల వారికి కూడా చెప్పుకొంటాం..
చూసారా పైన చూపిన కళ్ళు బైర్లు గమ్మే ఫిగర్లు? ఎవడి అబ్బ సొమ్ము ఇది? దీనికి రావాల్సిన పన్నులు ఎవడి బాబు చేల్లిస్తాడు?
Do you like this article? Do you agree with the author? If yes, Pleaase e-mail it to everyone you know by using the 'e-mail' link given below.. Let us keep the issue alive as much as we can.. and don't forget to leave a comment here to support our cause.. thank you
For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,

Comments (2) -

koresh
United States koresh said:

who will get the list of swiss bank accounts only indian courts ca do.

Close To Reality
United States Close To Reality said:

May be Indian Government can request Swiss Government.

Comments are closed