Home » Business | Close To Reality | Technology

ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా? Part : 2

19. May 2009 by close to reality 1 Comments

ఏదో ఒక నాడు నేనే కింగ్ ని..
మనకి మనము సర్ది చెప్పుకోవడం..
రోజూ మీతో ఎంతో మంది మాట్లాడుతుంటారు.. ఫోన్ లో, మీ ఎదురు గా, ఇదిగో ఇలా ఆన్ లైన్ లో.. ఎక్కడైనా కానీ, ఆ మీతో మాట్లాడుతున్న వ్యక్తి విజేతా, పరాజితుడా అన్నది మీరు ఎలా చెప్తారు? అంటే అతడు/ఆమె చెప్పింది చేస్తాడు/చేస్తుంది, సాధిస్తాడు/సాధిస్తుంది అనేది మీరు ఎలా చెప్ప గలరు? చాలా సులభం.. మాట్లాడేటప్పుడు వాడే విధానం, ఉదాహరణకి విజయం సాధించే వాళ్ళతో వాళ్ళ గమ్యం గురించి చిన్న చర్చ జరిపారనుకో, విజయాలను సాధిoచే వాళ్ళు "వాళ్ళ గమ్యం ఏంటి? అది ఎలా సాధ్యం? ఎప్పటికి ఆ గమ్యాన్ని చేరుకొంటాం?" స్పష్టం గా చెప్తారు.. అదే ఒక పరాజితుడిని అడిగారనుకోండి.. అలాంటి వాళ్ళకి ఒక గమ్యం ఉండటమే పెద్ద డౌటు,  పోనీ వుంది అందామనుకున్నా వాళ్ళ సమాధానం "ఏదో ఒక నాటికి నేను అది చెయ్యాలనుకుంటున్నాను, నేను అది అవుదామనుకుంటున్నాను, నేను ఇది అవుదామనుకుంటున్నాను" అలా వుంటుంది.. స్పష్టత శూన్యం..  కాబట్టి, "ఆ ఏదో ఒక రోజు" ఎన్నటికీ రాదు అని గుర్తుంచుకోండి..
పరాజితులు ఎందుకని 'ఏదో ఒక రోజున', 'నేను ఆశిస్తున్నాను', 'నేను కోరుకొంటున్నాను' లాంటి పదాలని వాడతారు అంటే, వాళ్ళు దేన్నన్నా సాధించటానికి ఒక తేది నిర్దేశించుకొని, ఆ టైం లోపు దాన్ని సాధించడాన్ని లేదా పూర్తి చెయ్యడాన్ని  అసహ్యించుకొంటారు, అందుకంటే ఒక వేళ ఆ ప్రయత్నం చేస్తే వాళ్ళు ఫెయిలు అవ్వచ్చు.. అది వాళ్లకి ఇష్టం వుండదు, కాబట్టి అసలు ప్రయత్నమే చెయ్యరు.. అప్పుడు, ఇప్పుడు అంటూ ఎదవ జీవితాన్ని అలా ముగించేస్తారు.. అదే విజేతలయితే ప్రయత్నిoచడానికి వెనకడుగు వెయ్యరు.. ఎందుకంటే, వాళ్లకి తెలుసు 'నేటి అపజయాలు, రాబోయే గెలుపులకి పునాది రాళ్ళు' అని..
మనందరికీ కలలు, గమ్యాలు వున్నయ్యి.. కలకి, గమ్యానికి తేడా ఏంటంటే, కార్యాచరణ రూపం దాల్చిన కలే 'గమ్యం'.. మీలో కూడా 'ఆర్ధిక స్వేచ్చ్ఛ, పెద్ద ఇల్లు,అందమైన భార్య, నలుగురికీ సాయపడుతూ మంచి పేరు సంపాదించు కోవడం' లాంటి కలలు వుండే వుంటాయి, అయితే మీలో ఎంత మంది ఈ కలల్ని నిజం చేసుకొన్నారు? ఒక వేళ చేస్తున్నారు అంటే ఎంతమంది నిజం చెయ్యడానికీ ఒక టైం లిమిట్ (ఫలానా రోజు కల్లా చేస్తాను, ఈ రకం గా చేస్తాను) తో ప్రణాళిక వున్నవాళ్ళు? ఎంతమంది "ఏదో ఒక రోజుకి, అది జరుగుతుందని ఆశిస్తున్నాను" అంటూ అరమోడ్పు కళ్ళతో ఆకాశం లోకి చూస్తున్నారు?
కాల పరిమితి  లేని గమ్యం గమ్యమే కాదు..
మీరు కొత్తిల్లు కొందాం అనుకుంటున్నారు, వూళ్ళో బిల్డర్ ని ఒకణ్ణి కలిసారు, వాడు మిమ్మల్ని సైట్ కి తీసుకెళ్ళి సగం లో వున్నా కొత్త అపార్ట్మెంట్ లని చూపించాడు, మీ ఆవిడకి, మీక్కూడా నచినట్లే వుంది.. వాణ్ణి అడిగారు, 'ఏమోయ్, అంతా బాగుంది, ఎప్పటికల్లా పూర్తి అవుతుంది ఈ నిర్మాణం?' అని.. వాడు మీకన్నా రెట్టింపు కూల్ గా సమాధానం ఇచ్చాడు.. "దీన్ని సిటీలోనే ఒక అధ్బుత భవన సముదాయం చెయ్యాలని మా కల, తప్పకుండా చేస్తాం, ఏదో ఒక రోజుకి దీన్ని పూర్తి చేస్తాం' అని చెప్పాడనుకోండి, మీరు ఆ అపార్ట్మెంట్ వాడి దగ్గర కొంటారా? కచ్చితం గ కొనరు కదా.. మరి అలాంటప్పుడు ఏదో ఒక రోజుకి సాధిస్తాను అనే మీ కలని మాత్రం ఎలా నమ్ముతున్నారు? అది మీ కల కాబట్టా? లేక వుచితం కాబట్టా?
జీవితంలో ఏదన్నా సాధించాలి అంటే దానికి మనం ఒక కాల పరిమితి విదించుకోవాలి.. అప్పుడే అది మనల్ని కుదురుగా కూర్చోనివ్వదు, మనతో పరుగులు పెట్టిస్తుంది.. వోటమికి భయపడి మొదలు పెట్టటమే మానేయ్యొద్దు, ఓటమి లేని జయాలు చాలా తక్కువ.. నేను కొన్ని చెత్త రాతలు రాయబట్టే ఈ రోజు కొన్ని మంచి పోస్ట్ లు నా సైట్ లో పెట్టగల్గుతున్నాను..
ఇంటర్నెట్ ద్వారా డబ్బులు సంపాదించటం అనేది చాలా మంది కోరిక.. నా మిత్రుల్లో కూడా కొందరు ఇదే కల గన్నారు, ఇన్ని సంవత్సరాల్లో ఒక్కడు మాత్రమె చెయ్యగల్గాడు, ఎందుకో తెలుసా? "ఒక సైట్ మొదలెట్టు ముందు" అని చెప్పగానే మొదలెట్టినందుకు.. మిగిలిన వాళ్ళు కూడా "మంచి ఐడియా, బాగుంది, ఎదవ జాబ్.. చేసి చేసి చిరాకు వచ్చింది, అన్నారు", చూద్దాం ఎప్పుడు మొదలు పెడతారో..
ఇక పోతే, మీ గమ్యాలు (లక్ష్యాలు) పురోగమన గమ్యాలు అయ్యి వుండాలి, తిరోగమన గమ్యాలు అయితే లాభం లేదు..
ఉదాహరణకి, నేను బ్లాగ్గటం మొదలెట్టినపుడు నాకు నచ్చిన విషయాలు నేను ఒక చోట పొండుపర్చుకోవడం అనేదే నా ఏకైక లక్ష్యం.. బ్లాగర్, స్పేసేస్ లాంటివి ప్రయత్నించా.. తర్వాత సరిగ్గా సంవత్సరం క్రితం నాలుగు రోజులు పొయ్యాక ఈ బ్లాగర్, స్పేసేస్ వాళ్ళు నా కాంటెంట్ అంతా వాళ్ళ బాబు గాడి సొమ్ము అంటారు అని, నా సొంత సైట్ మొదలెట్టా (సరిగ్గా ఇంచు మించు అలానే FACE BOOK వాడు కొన్ని నెలల  క్రితం ప్రకటించాడు, వాడి సైటుకి మీరు అప్లోడ్ చేసే ఫోటోలు, రాతలు అన్ని వాడి సొంతం అని).. అప్పటికయితే అదే లక్ష్యం అంతకు మించి పెద్ద లక్ష్యం అంటూ ఏం లేదు.. రాతలు సాగుతూ వస్తున్నయ్యి నాకు టైం వున్నపుడల్లా.. రెండు నెలల క్రితం నుండి నాకు నోటీసులు వస్తున్నాయి మే లో వచ్చే సంవత్సరం సైట్ ని సర్వర్ పై పొందు పరచినందుకు డబ్బులు కట్టి కాంట్రాక్టు పోడిగించుకోవాలి అని.. సో, అప్పుడు నా చిన్ని లక్ష్యం 'టైం ఎలాగూ పోతుంది మన హాబీ ని అమల్లో పెట్టినందుకు' మళ్ళీ జేబులోనుండి డబ్బులు కూడా నా అని.. పోనీ, ఈ ఒక సంవత్సరంలో ఈ సైట్ ఏం సాధించింది? వూరా? పేరా? అని.. ఒక చిన్న లక్ష్యం, ఈ రెండు నెలల్లో కాస్తంత గుర్తింపు, వచ్చే సంవత్సరం సైట్ ఫ్రీ గ దాని డబ్బులతో అది నడిస్తే మంచిది అని.. మరి లక్ష్యం చేదిన్చానా అని అడుగుతున్నారా? బ్రహ్మాండంగా.. వచ్చే వారం నా సైట్ renewal, కాని పోయిన వారానికే వచ్చే సంవత్సరం ఫీజులకు సరిపడా వచ్చేసినియ్యి.. ఎంత మొత్తం అన్నది ఇక్కడ ప్రశ్నే కాదు, మొత్తం కాస్త తక్కువే కావచ్చు కాని మన నిజమయిన లక్ష్యం కేవలం డబ్బులు మాత్రం కానే కాదు.. కాబట్టి, ఆ రకంగా అనుకున్నది సాదించాం.. ఇక రెండోది అతి ముఖ్యమైనది గుర్తింపు.. గత నెల రోజుల్లో కొన్ని లక్షల మంది సందర్శకులు వచ్చారు సైట్ ని చూడడానికి.. ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులు అయ్యిపోయ్యినా ఇంకా "ఆంధ్ర ఎన్నికల" గురించి ఎ సెర్చ్ యంత్రం లో నైన ప్రయత్నించండి .. నా సైట్ నెంబర్ వన్.. గత పది రోజులు గ.. గూగుల్ లో పూర్తిగా ఒక రోజంతా ఒక సైట్ ని ఒక టాపిక్ మీద మొదటి పేజిలోనో, మొదటి ఫలితం గానో వుంచాలంటే ఎంత కష్టమో ఇప్పటికే సైట్ లని నడిపే వాళ్ళని అడగండి చెప్తారు, అలాంటిది నా సైట్ గత పది రోజులుగా మొదటి పేజిలోనో, మొదటి ఫలితం గానో వస్తూనే వుంది.. నేటికీ ప్రతి రోజూ సైట్ సందర్శకులు వేలల్లో వున్నారు..  గతంలో ఏదో, సెర్చ్ ఇంజన్ పంపిస్తే నా సైట్ కి సందర్శకులు వచ్చే వాళ్ళు, ఇప్పుడు anigalla.net / anigalla.com అని వాళ్ళ బ్రౌసర్ లలో టైపు చేసి నేరుగానే వస్తున్నారు.. anigalla.net అనేది ఎమన్నా చిరంజీవి సినిమా పేరా గుర్తుంచుకొని మరీ వెళ్లడానికి, అలాంటిది ఇప్పుడు కొందరు సందర్శకులు నేరుగా వస్తున్నారంటే, ఇదే తోలి మైలు రాయి.. కాబట్టి, నా ఈ చిన్ని లక్ష్యం కూడా నెరవేరింది.. దిగువన ఈ రోజు అంటే 20.05.2009 న వివిధ సెర్చ్ యంత్రాల్లో నా సైట్ ఎ స్థానం లో వుందో వుదాహరణ చూడండి..

On Google
anigalla_on_google_200509
On Yahoo
anigalla_on_yahoo200509
On MSN
anigalla_on_msn_200509
On OpenDNS
anigalla_on_openDNS

తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం..

ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా? Part : 1

Your Ad Here

For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,
Share or Bookmark this post…
  • E-Mail
  • IndianPad
  • Digg
  • del.icio.us
  • Google
  • Technorati
  • StumbleUpon
  • Facebook
  • TwitThis
  • feedmelinks
  • Reddit
Bookmark and Share

Comments

nagasai
India nagasai said:

it is really or not sir ply send ur full details like phone and etc i
am talk with you ply i try 2 years onwords for online jobs
i am sai from kothagudem

Add comment




  Country flag

biuquote
  • Comment
  • Preview
Loading



Your Ad Here