Home » Business

ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా? Part : 1

8. May 2009 by close to reality 6 Comments

ఆన్ లైన్ లో డబ్బులు సంపాదించడం ఎలా? (ఎనిగళ్ళ.నెట్ / anigalla.net)
ముందు మాట:
ఎప్పటినుండో ఈ అంశం మీద ఒక గొప్ప వ్యాసం కాకపోయినా కాస్త మంచిది తెలుగులో తెలుగు వాళ్ళ కోసం రాయలనుకుంటూ రాయకుండా వస్తున్న నేను ఈ రోజు గూగుల్ గ్రూప్స్ లో "తెలుగు బ్లాగ్" సభ్యుడు అయిన అర్జున్ విన్నపాన్ని చూసి ఈ సారి ఎలాగయినా మొదలు పెట్టి చక్కగా ముగించాలి అని నిర్ణయించుకొని మీ ముందుకు వచ్చి నేను రాస్తాను అని వెంటనే సమాధానం కూడా పంపించేసాను..
మాటిచ్చాక తప్పకూడదు కాబట్టి ఈ రోజే ప్రారంభించాను కూడా.. ఇందులో చాలా చాలా విషయాలు వివరించవలసి వుంటుంది కాబట్టి పాఠక మిత్రులు కాస్త వోపిక పట్టి నేను రాసే సీరియల్ వ్యాసాలను క్రమం తప్పకుండా చదివి ఆచరణలో పెడితే టాటా, బిర్లా లంత సంపాదించకపోయినా కచ్చితంగా ఆదాయం మాత్రం వస్తుంది అని ఘంటాపదంగా చెప్పగలను.. 
అక్కడక్కడా కొన్ని ఆంగ్ల పదాలను వాడితే కాస్త సర్దుకుపొండి, మీ వద్ద ఆ ఆంగ్ల పదాలకు సరి అయిన తెలుగు అనువాద పదం వుంటే webmaster@anigalla.net కు ఒక ఉత్తరం ముక్క పడెయ్యండి, నేను దాన్ని సరిదిద్దుతాను.. ఆన్ లైన్ లో ఆదాయ మార్గాలు అనేకం ఉన్నా నేను మాత్రం ఇక్కడ బ్లాగులు, బ్లాగరుల చుట్టూ కేంద్రీకరించి వ్రాయబోతున్నాను..
పరిచయం:
బహుశా మీలో చాలా మంది ఆన్ లైన్ లో సంపాదించడం ఎలా అని వెతికి కొన్ని సార్లు కొన్ని పేరున్న సైట్ లోని ఒక పేజికి చేరుకొని, అక్కడ ఇలాంటివి చదివే వుంటారు.. "ఆఖరి అవకాశం", "గొప్ప అవకాశం", కేవలం $88 లకు మాత్రమే అని.. తీరా అది కట్టాక.. మిమ్మల్ని మరొక పేజికి పంపించి అక్కడ ఒక నాలుగు ముక్కలు రాసి, ఇది కేవలం సముద్రం యొక్క ఉపరితలం మాత్రమే.. అందులో నిక్షిప్తం అయ్యి వున్న నిధులన్నీ మీ జేబుల్లో / జాకెట్ లలో పడాలంటే $1800 లో $2400 లో కట్టండి మా ఆడియో క్యాసెట్లు/వీడియో లు/ఇంటర్వ్యూ/ పూర్తి పుస్తకం కోసం, అందులో మీకు అరటి పండు తొక్క తీసి మేమే పేస్ట్ చేసి మీ నోట్లో పెడతాం, ఇంక ఆ తర్వాత మీ ఎకౌంటు ల్లో డబ్బులే డబ్బులు అని చెబుతారు.. ఇది మీకు ఎవడన్నా చెప్పినా, ఇది మీరు ఎక్కడన్నా చదివినా ఆ చెత్తని అక్కడే వదిలించుకోండి..
అలాంటి "ఆఖరు అవకాశం", ఇంత కట్టండి, అంత కట్టండి అని ఈ పుస్తకం చివరి దాకా ఎక్కడా మీకు కనబడదు.. ఇది పూర్తిగా ఉచితం. నేను ఈ పుస్తకాలని అమ్మి జీవితం వెల్లదీయట్లేదు.. నేను చేసుకుంటున్న ఉద్యోగం నాకుంది, నేను రాసుకుంటున్న కాలక్షేపం బ్లాగూ నాకుంది.. నేను "ముప్పయ్యి రోజుల్లో మూడు కోట్లు సంపాదించడం ఎలా?" అని చెప్పే మనీ గురువుని కాదు.. లేక అలాంటి గురువులతో స్నేహం కూడా లేదు.. అందుకే ఈ పుస్తకం పూర్తిగా ఉచితం, ఒక్క ఉచితం మాత్రమే కాదు, మీరు మీకు నచ్చిన వాళ్ళందరికీ దీని ప్రతులను పంచుకోండి.. కానీ ఒక చిన్న విన్నపం, దీనికి మార్పులు చేర్పులు చెయ్యకండి.. ఏమయినా మార్పూ అవసరం అనిపిస్తే నాకో ముక్క చెప్పండి, నేను మళ్ళీ మార్చి PDF ప్రతి తయారు చేస్తాను.. ఏది ఏమి అయినా పుస్తకం పూర్తి అయ్యే వరకు, భాగములు క్రమం తప్పకుండా నా సైట్ లో పొందుపరచబడి వుంటాయి..
ఈ పుస్తకం ముగించే సరికి ఇప్పటికే నేను తరచూ నా మిత్రులకూ, నా సైట్ సందర్సకులకూ ఇచ్చిన చిట్కాలతో పాటు బోలెడు కొత్త చిట్కాలను కూడా ఇక్కడ పొందుపరుస్తాను.. ఈ పాటికే మీలో చాలా మందికి మరి "అంత మంచి పుస్తకం తనే అమ్ముకోవచ్చు కదా" అనే అనుమానాలు వచ్చే వుంటాయి, నేను ముందే చెప్పినట్లు, పుస్తకాలు అమ్మి బ్రతకట్లేదు, అదీనూ కాక ఇక్కడ మీకు చెప్పాల్సిందేంటంటే, నేను ఇంకో క్రూరమైన ఆలోచనతో ఈ పుస్తకం రాస్తున్నాను.. :) ఏంటి అంటే, ఈ పుస్తకం ఇంటర్ నెట్ లో అలా అలా వ్యాప్తి చెందుతూ వుంటే, అది చదివే మీకు ఈ పుస్తకం నచ్చితే, మీలో కొద్దిలో కొద్ది మంది అయినా నా సైట్ ని చూసే అవకాశం వుంటుంది కదా అని.. :) అంతే.. కాబట్టి, ఈ పుస్తకాన్ని ఆస్వాదిస్తూ.. తరచూ ఎనిగళ్ళ.నెట్ (anigalla.net) లో నా ఇతర రాతల్ని కూడా ఆస్వాదించండి.. 

పాఠకులు బ్లాగరులు అయితే కావాలంటే మీ బ్లాగులో కూడా ఈ పుస్తకం టైటిలు ని పెట్టి నా బ్లాగుకి అనుసంధానం చేసుకోండి.. లేదు, ఇది మీ బ్లాగు పాఠకుల కోసం కాదు, పూర్తిగా మీకోసం అయితే, నా సైట్ యొక్క RSS ని మీ గొలుసుల్లో పెట్టుకొంటే నేను తదుపరి భాగం రాసినపుడు అది మీకు మెయిల్ ద్వారా అందే అవకాశం ఉంటుంది.. ఇది ఒక ఉచిత సలహా మాత్రమే సుమీ.. :)

ముందు మాట, పరిచయం పూర్తి అయ్యాయి..
త్వరలో, ఇక్కడ మొదటి భాగమునకు గొలుసు మీకు అందుబాటులోకి తెస్తాను.. ఇది మాత్రం పాఠకులని వేచి వుంచడానికి చేస్తున్న జిమ్మిక్కు కాదండీ.. ఈ ఆర్ధిక మాంద్యంలో IT ఉద్యోగులం ఎంత వొళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయ్యాలో మీ అందరికీ తెలుసు కదా.. కాబట్టి వారాంతాల్లో ఒకటి లేదా రెండు అధ్యాయముల చొప్పున సాధ్యం అయినంత త్వరలో మీకు కావాల్సింది పూర్తి చేస్తాను.. సరేనా? సెలవా మరి?

For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,

Comments (6) -

BPhaniBabu
India BPhaniBabu said:

మీరు ఈ పైన వ్రాసే వివరాలకై వేచి ఉంటాను.

Close To Reality
United States Close To Reality said:

ఫణి బాబు గారు..
ధన్యవాదములు.. వీలు అయినంత త్వరలో తరువాయి భాగం మీ ముందు వుంచుతాను..

saimokshith
India saimokshith said:

purthi vivaralakai A..duru chusthu...........................!

saritha
India saritha said:

you so very good i have meet to  i wait book so thank you very much

Rams
India Rams said:

very intrest

valavala ramesh
India valavala ramesh said:

please send me details..i need it

Comments are closed