By Kalyan Chakravarthy Vallurupalli
పెట్రోల్ ధర లు-వాస్తవాలు
పెట్రోల్ ధరల పై ప్రభుత్వ వైఖరి ని ఎండగడదాం..ప్రజలకు అర్ధమయ్యే రీతి లో విపులం గా చెబుదాం.. పెట్రోల్ ధరల పెంపు ప్రజా జీవితానికి ఎలా ముడిపడి వుందో,సామన్యుని జీవితాన్ని ఎలా అతలాకుతలం చేస్తుందో ..ప్రజలకు సవివరం గా వివరించాల్సిన బాధ్యత మనది..సంక్షేమ పధకాల పేరు తో ప్రజలకు ఎంగిలి మెతుకులు విదిలిస్తూ..రాష్ట్రాన్ని ఇష్టారాజ్యం గా దోపిడీ చేస్తున్న ఈ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం..ఆ సంక్షేమ పధకాల మాటున ఆ పధకాలకు అవసరం అయిన నిధులను కుడా ఎలా దోపిడీ చేస్తునాయో..చెప్పటానికి పెట్రోల్ ధరలే ఒక వుదాహరణ .
మనలో చాల మందికి ఒక భ్రమ వుంది .విద్యావంతులతో సహా ..diesel పైన ప్రభుత్వం ఏదో సబ్సిడీ ఇచ్చి వుద్ధరిస్తుందని.. వాస్తవానికి పెట్రోల్ ,లేదా diesiel వుత్పతికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ..14 రూపాయలు..ముడి చమురు,దాని సుద్ది కి, మార్కెటింగ్ తో పాటు ,౩౦% లాభాన్ని ద్రుష్టి లో పెట్టుకుంటే అయ్యే మొత్తం ఖర్చు 35 రూపాయలు ..చమురు సంస్థల నష్టాలపై ఏట ప్రభుత్వం అక్షారాల 1.40 లక్షల కోట్లు..ఇది మధ్య తరగతి జేబులోంచి వెళ్తున్న సొమ్ము..అక్షరాలా 1.40 లక్షల కోట్లు.మధ్య తరగతి ప్రయాణం చేసే R.T.C బస్ టికెట్ రేట్ నించి..పాలు,కూరగాయలు,నిత్యావసర వస్తువులు,ఆటో చార్జీలు, ఇలా కావేవి అనర్హం అన్నట్టు ప్రతి దీ పెట్రోల్ రేట్ పెరిగిన ప్రతిసారి పెరగటం మనం గమనిస్తే అర్ధం అవుతుంది.పెట్రోల్ ధరలు మన దైనందిక జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తాయో..ప్రతి ధర పెట్రోల్ ధరలతో ముడిపడివున్న విషయాన్నీ మనం గమనించాలి.ఈ పెట్రోల్ ధరల పై పెరిగే ధరలు..ఆ ధరల పై ప్రభుత్వం పన్నులు..అంటే ఒక బట్టల దుఖాన దారుడు మనకు పెట్రోల్ ధర 35 రూపాయలు వున్నపుడు అమ్మే ధర కన్నా పెట్రోల్ ధర 50 రూపాయలు వున్నపుడు అమ్మే ధర సహజం గా ఎక్కువ చేస్తాడు..ఆ మేరకు అతడు పెరిగిన రవాణకర్చులు కలుపుకు అమ్మే ధర ఎక్కేవే అవుతుంది కదా.ఇప్పుడు అతను కట్టే అమ్మకం పన్ను కుడా ఎక్కువే అవుతుంది,సదరు దుకాన దారుడు ఆ పెరిగిని పన్ను కుడా కలిపి అమ్మేది మళ్ళి వినియోగాదారుడికే..అంటే అన్ని విధాలుగా నష్టపొయేది సామాన్యుడే..ఇది మనం తినే వుప్పు..పప్పు అన్నిటికి వర్తిస్తుంది..ఇప్పుడు అర్ధమైయ్యిందా?జీతం గీతం ఎందుకవుతుందో.. ఎంగిలి మెతుకుల వంటి పధకాలు ప్రకటించి ప్రభుత్వం ఆ డబ్బులు కుడా మన దగ్గరే దోపిడీ చేస్తున్నదని...వున్న సొమ్ము అంతా వీరు దోపిడికే సరిపోతుంటే మరి మనకు సంక్షేమ పధకాల పరు తో ప్రకటించే డబ్బు ని ఎక్కడ నించి తెస్తారు… మన జేబులోంచే… ఇదంతా మన జేబులోంచే తీస్కునే ఒక విష వలయం..పాత సినిమాల్లో.. పొద్దున్న చేసిన పనికి కూలి ఇచ్చి సాయంత్రం,పక్కనే సార కొట్టు,పేకాట క్లబ్ పెట్టి ఆ కూలి జేబు నించి కర్చు చెయ్యించే ఒక కాంట్రాక్టర్ మాదిరి ఈ ప్రభుత్వం వ్యవహిరిస్తోందని గుర్తించండి.ఈ విష వలయం లో నలిగిపోతుంది మనం..లీటర్ విమాన ఇంధనానికి ప్రభుత్వం వసూలు చేస్తున్నది రూపాయి 1.80 పైసలు మాత్రమే..కాని డిజిల్ పై 3.80 రూపాయలు..పెట్రోల్ ఫై ఏకం గా 13 రూపాయలు….
ఇక ప్రభుత్వం చెప్పే మరో విషయం వంట గాస్,కిరోసిన్ పై ఇస్తున్న సబ్సిడీ వల్ల వచ్చిన నష్టాలను ఇప్పుడు పెట్రోల్ ఫై వచ్చే ధరల తో బర్తి చేస్తారట..అంటే మన కిచ్చే సబ్సిడీ మన దగ్గర నిండే వసూలు చేస్తున్నారనమాట..ఇక వీరు ఏమి సబ్సిడీ ఇస్తునట్టు..?ఎవరికీ సబ్సిడీ ఇస్తునట్టు..?ఎవరి జీవితాలను వుద్ధరిస్తునట్టు..?పెట్రోల్ ధరలు ఎక్కువ వునప్పుడు మూతపడిన కొన్ని ప్రైవేటు పెట్రోల్ బంకు లు..మళ్ళి ఎవరి అండ తో 6 నెలల విరామం తో ..ఎవరి భరోసా తో..తెరుచుకుంటునవో, వారి ప్రయోజనాల కోసమే.. ఇంత ప్రజా వ్యతిరేఖత వున్నా ఈ ప్రభుత్వం "దున్నపోతు మీద వాన పడినట్టు" ప్రవర్తిస్తున్నది.. గమనించండి ఈ "ప్రజా ప్రభుత్వం" తీరు...మన జేబు నిండి దోపిడీ చేసి మనని మోసం చేస్తున్న వైనం..ఒక్క నిమిషం ఆలోచించండి..
కొసమెరుపు:
పంజాగుట్ట flyover కులినపుడు మన ముఖ్యమంత్రి గారు ”అమెరికా లో కులలేదా,ఇంగ్లాండ్ లో కులలేదా అని పాపం తెగ ఆవేశ పడిపోయారు..ఈ 6 నెలలలో అమెరికా లో నే కాదు ప్రపంచం మొత్తం ప్రజాస్వామ్యం వున్న ప్రతి దగ్గర పెట్రోల్ ధరలు 60% తగ్గాయి..మరి ఇక్కడో?
For movie news and free telugu songs download, visit
anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,