గాలి ధనార్జన రెడ్డి.. ఈ గాలి మొదలయ్యి పది సంవత్సరాల్లో సుడి గాలి గా మారింది.. దీనికి అడ్డుకట్ట వెయ్యడం కనుచూపు మేరలో అసాధ్యంగా కనబడుతోంది.. సరిగ్గా పదేళ్ళ క్రితం "ఎన్నోబుల్ ఫైనాన్సు" బోర్డు త్రిప్పిన ఈయన నేడు వేల కోట్లకు అధిపతి అవ్వడం వెనుక తిలా పాపం తలా పిడికెడు అని చెప్పుకోవాలి.. ఆంధ్ర ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డూ అదుపూ లేకుండా నిభంధనలని "గాలి" కొదిలేసిన విషయం మన కన్నా డిల్లీ లో కూర్చున్న వాళ్ళ మేడం కే బాగా తెలుసు..
గత సంవత్సరం కర్నాటక అసెంబ్లీ ఎలేక్షన్స్ లో బళ్లారి ఆ చుట్టూ పక్కల ముప్పయ్యి నియోజక వర్గాల్లో ఆంధ్రా అక్రమ గనుల డబ్బుల వరద కురిపిస్తున్న "గాలి" బ్రదర్స్ ని చూసి డిల్లీ లో ఉన్న సోనియాకి గాలి ఆడక వాళ్లకి అడ్డుకట్ట వెయ్యడానికి వాళ్ళ అనుంగు మిత్రుడు అయ్యిన ఆంధ్ర ముఖ్య మంత్రి నే రంగంలోకి దింపాల్సి వచ్చింది.. ఇంత చేసినా దగ్గర దగ్గర ముప్పయ్యి నియోజక వర్గాలనీ గెలిపించుకొన్న గాలి ఇప్పుడు కర్ణాటక కి అప్రకటిత ముఖ్యమంత్రి అని కర్నాటక ప్రజలే చెబుతున్నారు..
అందుకే ఈ సారి పార్లమెంటు ఎన్నికలకి ముందే వాళ్ళ అక్రమార్జనకి చెక్ చెప్పటానికి తద్వారా ఎన్నికల్లో గాలి డబ్బుల ప్రభావం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు తెచ్చినా ఈ గాలిని ఆపడం ఎవ్వరి వల్లా కాలేదు.. ఈ గాలి ఈ దేశ ప్రభుత్వ ఉత్తర్వులు ఖాతరు చెయ్యదు, కోర్తులనీ లెక్క చెయ్యదు, ఎవడు ఎం చెబితే మాకేంటి మేము మాత్రం మా అక్రమ తవ్వకాలని ఆపేది లేదు అని పబ్లిగ్గా చెబితే వీళ్ళని బొక్కలో తోసే ధైర్యం ఎవ్వరికీ లేకపోయింది..
ఒక వ్యక్తి ఒక దశాబ్దం కన్నా తక్కువ కాలం లో వేల కోట్లు గడిస్తుంటే, మరి ఆదాయం లేదు అని ప్రజల గల్లా పట్టుకొని పన్నులు వసూలు చేసే, ఆదాయం లేదు అని లిక్కరు గేట్లు తెరిచే ee చేత గాని ప్రభుత్వాలు, మరి ఆ మైనింగ్ ఏదో ప్రభుత్వమే అండర్ టేక్ చేసి కోట్లు గడించి రాష్ట్రాన్ని అప్పుల బారిన పడకుండా ఆపొచ్చు గదా, మరి ఎందుకు చెయ్యదు అంటే, అది ప్రభుత్వానికే తెలియాలి.. మరి ఆ అక్రమ సంపాదనలో వీళ్ళకి కూడా ఈ రోజు ఏడు కొండలు వారికి వజ్ర కిరీటం లానే, ఎ పత్రికలో పెట్టుబడులో, ఎ టివి చానల్ లో పెట్టుబడులో, ఎ ఉక్కు కర్మాగారం లో పెట్టుబడులగానో గాలి మల్లలేదని ఎక్కడ వుంది గ్యారంటీ?
వీరికి ఒకటికి మించి విమానాలూ, వేల కోట్లు, మంత్రి పదవులూ.. దేశాన్ని దోచే వాళ్ళే విధానాలు చేసే విధాన సభల్లో కూర్చుంటుంటే, ఇంకా దెస ప్రజలకి ప్రయోజనకారి గా వుండే చట్టాలు ఆ సభ లో ఆమోదించబడతాయి అనుకోడం గాల్లో దీపం పెట్టి ఏడు కొండలవాడా, ఈ దీపాన్ని కొండ ఎక్కిన్చవద్దు అని ప్రార్ధన చెయ్యడంతో సమానం.. ధనమంతా ఇలా ఒక్క చోట కేంద్రీకృతం అవుతుంది, ఒక కుటుంభం వాళ్ళ మిత్రుడి కుటుంబం వేల కోట్లు సంపాదించి రాష్ట్రంలో ఒక భాగం అంతా అనధికారంగా వాళ్ళ పేర్ల మీద రాసుకొంటారు.. ఆర్ధిక అసమానతలు పెరగుతున్నాయి అంటే మరి ఎందుకు పెరగవు..
మరి ఈ పాపం అంతా ఎవరిది, కనీస వేతనాలకి ప్రాణాలకి తెగించి గనుల్లో పని చేసే ప్రజలది మాత్రాం కాదు.. ఎ సి గదుల్లో కూర్చొని చూడకుండా చదవకుండా కరెన్సీ కట్టల వాసన చూసుకుంటూ సంతకాలు పెట్టిన నాయకులదే.. అదే మాట నేనంటే, ఆ నాయకుడి సమాధానం ఏంటి తెలుసా? నేనిక్కడ కూర్చున్నాను సరే, నేను సంతకం పెట్టాను సరే, కాని నన్ను ఇక్కడికి పంపించింది ఎవరు అని? నేనేం సమాధానం చెబుతాను? అవును గదా మేమే కదా వోట్లు వేసి మరీ నిన్ను గెలిపించింది.. గెలిపించే ముందు వుండాలి మాకు ఆ బుద్ధి.. ఇప్పుడు గోల చేసి ఎం లాభం? ఈ అయిదేళ్ళలో ఇంకా అనంతపురంలో మిగిలేది గనులు గాదు.. ధనమూ గాదు.. అక్కడ శాశ్వతం ఒక్క "గాలి" మాత్రమె..
ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు ఆ గాలి బ్రదర్లు ఆంధ్రా వస్తుంటారు.. వారు కర్నాటక బి.జే.పి మంత్రులు, కాని వాళ్లకి ఆంధ్రా లో ఘన స్వాగతం పలికేది ఆంధ్ర కాంగ్రెస్ నాయకులు.. మరి ఈ రంకు వెనుక లింకు ఏంటో? ఇప్పటికయినా అర్ధం అయ్యిందా ఏడు కొండల వాడికి అంత బరువున్న కిరీటం ఎందుకో, ఈ "గాలి" పాపాలని చూసే తీరిక ఏడు కొండల వాడికి లేకుండా వుండటానికి, ఎందుకంటే ఆయన ఈ నలబయ్యి అయిదు కోట్ల శిరో భారం ని దించుకోవదానికే తల పట్టుకొని కూర్చుంటాడు కదా.. ఈ లోపు దేశం లో ఇంకా ఎక్కడెక్కడ గనులున్నాయో, లొసుగులు వున్నాయో అక్కడకి ఈ "గాలి" చొచ్చుకొని పోతుంది..
దొంగలు దొంగలు వూళ్ళు పంచుకొనే రోజులు పొయ్యాయి మిత్రులారా.. ఇప్పుడు దొంగలు దొంగలు రాష్ట్రాలు, దేశాలూ పంచుకొంటున్నారు..
here they said whole Bellary belongs to them (బళ్లారి పట్టణమే వాళ్ళది అంట..)
గాలి గతం గతుకులమయం.. Who are the Reddy brothers and how did they come to dominate Karnataka’s political scene? Sons of a police constable, stories abound of the time when the Reddy brothers criss-crossed dusty Bellary roads on a two wheeler as they attempted to establish (and later save) a non-banking financial institution,Ennoble Savings and Investment India Pvt. Ltd. The company wound up in 1998, with complaints of fraud and cheating to the tune of Rs 200 crore. Meanwhile, Sriramulu had surfaced on the local political scene as a disciple of the then Congressman Diwakar Babu. The 1999 Lok Sabha elections saw the real emergence of the Reddy brothers. Their assets are known to run into thousands of crores of rupees; in an Income Tax department raid in October 2007, the Reddy brothers reportedly paid a few crore rupees as dues. A much talked about asset is the fleet of helicopters that the brothers use frequently, You must read this.. Source:Tehelka
Obulapuram mining firm continues operations
Express News Service, First Published : 28 Apr 2009 02:28:00 AM IST
Last Updated : ANANTAPUR: Despite the Union Environment and Forests Ministry’s orders that licenses of five mining companies should be suspended in D Hirehal mandal till the demarcation was done by the Survey of India, Obulapuram Mining Company and other companies owned by Karnataka Tourism Minister Gali Janardhan Reddy are continuing their mining activity.

For movie news and free telugu songs download, visit
anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,