Home » 2009 elections | andhra politics | andhra pradesh | Telangana

మేడం ముఖం పై ఎం.ఎల్.ఎ, ఎం.పి ల రాజీనామాలు..

9. December 2009 by close to reality 0 Comments
మేడం ముఖం పై ఎం.ఎల్.ఎ, ఎం.పి ల రాజీనామాలు..
మర్యాద అనేది నిలబెట్టుకొనే దానిపై ఆధార పడి వుంటుంది. 'అమ్మ', 'మేడం' అని సాష్టాంగ నమస్కారాలు చేసే కాంగ్రెస్ తమ్ముళ్ళు ఈ రోజు ఆ అమ్మ మొహం పైనే తమ రాజీనామాలు విసిరి కొట్టారు. ఒక్కాల్లు కాదు, ఇద్దరు కారు ఏకం గా 53 మంది. ఆత్మాభిమానం తో ఆడుకోవదానికీ ఒక హద్దు వుంటుంది అని చెప్పకుండా చెప్పారు.
అర్ధరాత్రి ఏకపక్షంగా ఎవ్వరి అభిప్రాయాలూ తీసుకోకుండా ఆంధ్ర ప్రదేశ్ వాళ్ళ అబ్బ సొత్తు అయినట్లు డిల్లీ లో కూర్చొని నిర్ణయాలు తీసుకొంటే దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పారు. సొంత ప్రభుత్వాన్నే మైనారిటీ లోకి నెట్టారు.
దెబ్బకి కళ్ళు బైర్లు కమ్మిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు మళ్ళీ చర్చలు అంటుంది.
కెలకటం ఎందుకు? కడుక్కోడం ఎందుకు?
కళ్ళు తెరవాలి మరి ఇకనైనా..

తెలంగాణా నడి బొడ్డు, హైదరాబాద్ లో పట్టు మని పది రోజుల క్రితం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎలేక్షన్స్ లో నిలబడే దమ్ములేని ఎధవలంతా ఇప్పుడు ప్రజలు తెలంగాణా కావలి అంటున్నారని చిల్లర గొడవ మొదలు పెట్టారు. ఆ ప్రజలే వీళ్ళ పక్క వుంటే ఆర్నెల్ల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో మొత్తం 119 తెలంగాణా నియోజక వర్గాలకి గాను, కేవలం 15 సీట్లు గెలవటం ఏంటి? ఆ ప్రజలే వీళ్ళతో వుంటే మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చెయ్యక పోవటం ఏంటి? ఎవన్ని ఎదవల్ని చేద్దామని వీళ్ళఆలోచన?

పట్టు మని పదిహేను మంది కూడా లేని ఒక పోకిరి గుంపు కోరికలని, అది కూడా ఎ.సి రూముల్లో సెలైను బాటిల్లతో, మందులు, డాక్టర్ల పర్యవేక్షణ లో నిరాహార దీక్ష అనే నటనకి అతిగా స్పందిస్తే, మరి ఇప్పుడు ఏకంగా 93 మంది, ఈ పార్టి, ఆ పార్టీ అని లేకుండా అన్ని పార్టీ లనుండి 93 మంది ఒక్క పూటలో రాజీనామా చేస్తే మరి ఎలా ప్రతిస్పందిస్తారో చూద్దాం.. ప్రజల మనస్సులో ఏముందో ఇప్పటి కైనా గ్రహిస్తారని ఆశిద్దాం.
ప్రత్యెక తెలంగాణా కావాల్సిన వాడెవడైనా ప్రజల్లోకి వెళ్ళాలి, ఎన్నికల్లో గెలవాలి, తెలంగాణా తెచ్చుకోవాలి. అంతే గాని నిమ్సు లో కూర్చొని ప్రజలంతా నా పక్కే అంటే పంచెలు వూడతయ్యి.
జై ఆంధ్ర ప్రదేశ్.

For movie news and free telugu songs download, visit anigalla.com.
thank you for visiting anigalla.net , you can leave a comment here about the article or contact us through our contact form - webmaster@anigalla.net ,
Comments are closed