Home » Bollywood | Business | Government of India | Hyderabad | Music | Telugu Movies | Tollywood

వీళ్ళ ఇంటెలెక్ఛువల్ ప్ర్రాపర్టీ ని ఎవడో ఎత్తుకుపోతున్నాడట!

19. March 2010 by viswamitra 1 Comments

ఉగాది సాయంత్రం సినెమాకి వెళ్దామని ఇంట్లో తీర్మానం పెట్టారు. దాన్ని బుధవారానికి వాయిదా వేశాను. ఆరోజు శ్రీమతిగారు నగరంలో సినిమాలు పెద్ద ఆసక్తికరంగా ఏమీ లేవని ఆ ప్రోగ్రామ్ ని నిరవధికంగా వాయిదా వేశారు. కానీ మా వాడు వదల్లేదు. గురువారంనాడు మొత్తం లిస్ట్ ని మధించి రెండింటిని ఫైనల్ చేశాం. ఏ మాయ చే(సా)శావె లేదా లీడర్. నా "అతిథి" (హింది)/మాయబజార్ (కలర్) ప్రొపోసల్ పక్కన పెట్టారు. ఒకటే సీన్ ని మూడు గంటలు చూసే ఓపిక ఉంటే ఏ మాయ చేసావె (YMC) కి వెళ్ళండని మా శ్రేయోభిలాషులు బెదిరించారు. మేము ధైర్యం చేశాం. కానీ మా వాడికి బోర్ కదా అని లీడర్ ఒకే చేశాం.

 

కానీ వాడు ఆ సమయానికి నిద్రపోవడంతో ప్రోగ్రాం మళ్ళీ మొదటికి వచ్చింది. రోజూ ఎవరో ఒకర్ని(హీరో/హీరోయిన్ వాళ్ళ అమ్మ, అక్కతో సహా) స్టూడియోకి తీసుకొచ్చి "It's Different" అనిపిస్తారు, టీవీల్లో ఊదరగొడుతుంటారు. ఈ సినిమాలో విలన్ ఎవరో కనుక్కోండని మరో "ఒంటరి" బాధ. కానీ భూతద్దం పెట్టి వెతికినా సరయిన సినిమా లిస్ట్ లో దొరకదు.

 

మనం చేసేదే తప్పయినపుడు దాన్ని కరెక్ట్ గా చేయాలనులకోవడం... అంటూ అతడు చిత్రంలో ఒక డైలాగ్ ఉంటుంది. చేసేదే దొంగ పని, మళ్ళీ దానికి ఒక సర్టిఫికేషన్ ఒకటి. ఆ తర్వాత ఆ కళాఖండాల ప్రొటెక్షన్ కి చట్టాలు చేయాలట. మన తెలుగు సినెమా వాళ్ళ కష్టాలు కూడా అంతే ఉన్నాయి. ఏడాదికి ఒకటి అరా హిట్లు ఉంటాయి. విడుదలయ్యే సినిమాల్లో ఎక్కువ కాపీ కథలు, కాన్సెప్ట్ లు, సన్నివేశాల ఆధారంగానే తయారవుతాయి. సౌత్, నార్త్, వెస్ట్ తేడాల్లేకుండా "కొట్టుకొచ్చే" పనిలో మనవాళ్ళు సిద్ధహస్తులు. ఇప్పుడు వీళ్ళ ఇంటెలెక్ఛువల్ ప్ర్రాపర్టీ ని ఎవడో ఎత్తుకుపోతున్నాడట!

 

కార్పొరేట్ కల్చర్ ఈ పరిశ్రమలోకి వస్తే వారసులు ఏమై పోవాలి! టాలంట్ ఉన్నవాడు పైకొచ్చేస్తాడేమో?! అందుకే మనవాళ్ళు కుటుంబస్వామ్యాన్ని వదులుకోలేరు. పైగా మేం కోట్లు గుమ్మరిస్తున్నామని ఏడుస్తారు. ఎవడడిగాడు వీళ్ళని అనవసరపు ఖర్చులు పెట్టమని. వీళ్ళు ఖర్చుపెడతారట. ఆ తిక్కపనుల వసూలుకి టికెట్ రేట్లు పెంచుతారట. దానికి ఎవడూ నిరసన తెలియజేయడు. సినిమా విడుదలయిన నెలలోపు ఒరిజినల్ DVD/CD విడుదల చేసే దమ్ము ఒక్కడికి ఉండదు. విషయమున్న చిత్రాలు తీయలేక, సమిష్టి పెట్టుబడులతో ముందుకు వచ్చి తెలివిగా ఖర్చు పెట్టడం రాక, మార్కెట్ చేసుకోవడం తెలీక తంటాలు పడే వీళ్ళని చూస్తే ఒకటి మాత్రం గుర్తుకొస్తుంది. వాళ్ళ కామన్ డైలాగ్: వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మేం విడుదల చేస్తున్నాం.

 

కృత్రిమమైన సీన్స్త్ తో ముసలి ముతక చవకబారు వాసనలతో వికృతమైన ప్యాచ్ వర్క్ విచిత్రాలు తీసే మన దర్శక నిర్మాతలు ఎప్పుడూ జపించే మంత్రం అదే కదా! వీడియో షాప్స్ వాళ్ళు ఇప్పుడదే అంటున్నారు. వినపడుతుందా?

piracy

Gallery: Telugu film celebrities @ Anti Piracy Fasting Camp

Gallery: Ravi Teja & Prabhas at anti piracy camp

Gallery: Puri Jagannath & Naga Chaitnya

 

For more news on current affairs and andhra pradesh politics, visit anigalla.net | apolitical & a political. Thank you.

Comments (1) -

ANTI FAN
India ANTI FAN said:

Mastu raaseve.! hands off
The blady buggers are going in our tollywood industry. Yaak tu